
జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఫైనల్ సిరీస్ "జురాసిక్ వరల్డ్: ఖోస్ థియరీ" ఓటీటీలో విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ యానిమేటెడ్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ డైనోసార్లు మనుషుల ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జరిగే సంఘటనల గురించి తెలియజేస్తుంది. మొదటి సీజన్‌లో, బ్రూక్లిన్, సోయోనా శాంటోస్ వంటి పాత్రలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇందులో కూడా వారు కొనసాగనున్నారు. ఈ సిరీస్ ప్రధానంగా వినోదం, స్నేహం, డైనోసార్ల గురించి ఉంటుంది. "జురాసిక్ పార్క్" ఫ్రాంచైజీలో భాగం, డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్ ద్వారా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.