
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ సినిమా 'కిష్కింధపురి'(Kishkindhapuri ) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించికుంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్మురేపింది.
'కిష్కింధపురి' చిత్రం జీ5 వేదికగా అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఆపై అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో ఈ మూవీని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగానే రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ ఢీల్ కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ మరోసారి మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.

కథేంటి?
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమికులు. మరో స్నేహితుడితో కలిసి ఘోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తుంటారు. దీనికి బయట నుంచి కొందరు వ్యక్తులు వస్తుంటారు. వీళ్లందరూ కలిసి జన సంచారం లేని కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఓ సందర్భంలో 'సువర్ణమాయ' అనే పాడుబడ్డ రేడియో స్టేషన్‌కి 11 మంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత ఊహించని రీతిలో ముగ్గురు చనిపోతారు. అనంతరం ఈ బృందంలోని ఓ చిన్నారి.. దెయ్యానికి టార్గెట్ అవుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతున్న దెయ్యం ఎవరు? రాఘవ ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.