
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమా 'లిలో అండ్ స్టిచ్' ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. మే 23న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారత అభిమానుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉండనుందని మొదట ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడెన్గా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
'లిలో అండ్ స్టిచ్' చిత్రాన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్, రైడ్‌బ్యాక్ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించారు. 2002లో ఇదే టైటిల్తో విడుదలైన సినిమాకు లైవ్-యాక్షన్ రీమేక్గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 3 నుంచి జియోహాట్‌స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రకటనలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ భాషలలో మాత్రమే విడుదల కానుందని జియోహాట్స్టార్ మొదట చెప్పింది. తన టాలీవుడ్ సబ్‌స్క్రైబర్‌లను నిరాశపరచకూడదని సడెన్గా తెలుగు వర్షన్ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

'లిలో' జీవితం కోట్ల కలెక్షన్స్ రాబట్టింది
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ. 8800 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘లిలో అండ్ స్టిచ్’ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ యానిమేటెడ్ క్లాసిక్ లైవ్ యాక్షన్ సినిమాలో మైయా కీలోహా, సిడ్నీ అగుడాంగ్, క్రిస్ సౌండర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్న లిలో అనే అమ్మాయి జీవితంలోకి స్టిచ్ అనే గ్రహాంతరవాసి ఎంటర్ అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం మొదలౌతుంది. దీంతో లిలో జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరి హృదయాన్ని తాకే చిత్రంగా ప్రశంసలు దక్కించుకుంది.