
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం 'ట్రాన్: ఏరీస్'.. దర్శకుడు జోయాకిమ్ రోన్నింగ్ తెరకెక్కించిన ఈ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్టర్, ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్ (1982), దాని సీక్వెల్ ట్రాన్: లెగసీ (2010) తర్వాత వస్తున్న మూడవ చాప్టర్ ఇది. ఈ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
డిజిటల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్ ఒక ప్రమాదకరమైన మిషన్‌లో నడిచే కథ ఇది. ఇదే మానవజాతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I.) జీవుల మధ్య మొదటి భేటీగా నిలుస్తుంది. ఈ చిత్రంలో జారెడ్ లేటో ప్రధాన పాత్రలో నటించగా, గ్రెటా లీ, ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ నటీనటులు కనిపించనున్నారు.