
ఈ వీకెండ్‌లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్‌టైమ్ కేవలం 1:50 మాత్రమే.

ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్‌స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.
మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్‌తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు.

కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్‌ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్‌గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.
ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు.