ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష | US Rapper Diddy Sentenced to 4 Years in Prison for Trafficking | Sakshi
Sakshi News home page

ప్రియురాలు ఫిర్యాదు.. సింగర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష

Oct 4 2025 10:34 AM | Updated on Oct 4 2025 11:06 AM

American ryaper Sean Diddy Combs Jailed For More Than 4 Years

అమెరికన్  ప్ర‌ముఖ ర్యాప‌ర్ డిడ్డీ (54)కి జైలు శిక్ష పడింది. అమ్మాయిల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడని ఈ ఏడాది జులైలో న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో ఆయన్ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కానీ,  అతని  మాజీ ప్రియురాళ్ళు  కాసాండ్రా వెంచురా, జేన్‌లతో వ్యభిచారం కోసం రవాణా చేసినందుకు అతని ప్రమేయం ఉందని తేలింది. తమను డిడ్డీ విక్రయించాడని వారు కోర్టుకు ఆధారాలు అందించారు. దీంతో అతనికి 4ఏళ్లు జైలు శిక్ష పడింది.

2016లో డిడ్డీ త‌న ప్రియురాలు కాసాండ్రా వెంచురా నుంచి బ్రేక‌ప్ అయ్యాడు. కానీ ఆ సమయంలో ఆమె డిడ్డీపై పలు ఆరోపణలు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా హింసించాడని పేర్కొంది. అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా స‌హా చాలా కేసులు కూడా ఆ సమయంలో పెట్టింది. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాసాండ్రా ఆరోపించింది. ఈ క్రమంలోనే తనను విక్రయించాడని కూడా పేర్కొంది.

ర్యాపర్‌ డిడ్డీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని న్యాయమూర్తి పేర్కొన్నాడు. దీంతో అతనికి 4 ఏళ్లు జైలు శిక్ష విదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షను అధిగిమించి తిరిగొస్తావని ఆశిస్తున్నట్లు డిడ్డీతో ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మహిళలకు హాని కలిగించడానికి నువ్వు చూపిన చొరవ.. వారికి సహాయం చేయడానికి చూపించాల్సింది అంటూ చేసిన పాపాల విముక్తి కోసం ఈ శిక్ష  తప్పదని పేర్కొన్నారు.

త‌న ప్ర‌తిభ‌తో గ్రామీ అవార్డులను సొంతం చేసుకుని మ్యూజిక్ మొఘ‌ల్ గా డిడ్డీ కీర్తిని అందుకున్నాడు. కోర్టు తీర్పు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన భయానకంగా, అవమానకరంగా ఉందని తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే తాను మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని చెప్పాడు. నేను చేసిన తప్పులను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించుకోను. నేను శిక్ష అనుభవించాల్సిందే. డిడ్డీ 2029లో విడుదల కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement