
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా శివ కుమార్ రామచంద్రవరపు మెప్పించాడు. ప్రస్తుతం ఆయన ఒక మెడికల్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. తన కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా విలన్‌గా కూడా పలు సినిమాల్లో నటించాడు. గతేడాదిలోనే ఆయన హీరోగా నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన విడుదలైన విషయం తెలిసిందే. నిన్నుకోరి, వకీల్ సాబ్, తొలిప్రేమ, మజిలీ వంటి చిత్రాలతో శివ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మల్టీ టాలెంట్ ఉన్న శివ కుమార్ ఇలా మెడికల్ షాప్‌లో పనిచేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే, శివ కుమార్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. సినిమా ఛాన్సులు లేకపోవడంతో తెలంగాణలోని సూర్యాపేటలో ఒక మెడికల్ షాపులో ఆయన పనిచేస్తున్నట్లు ఒక వీడియో ఫుటేజ్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. షాప్‌లోకి వచ్చిన కస్టమర్స్‌కు మెడిసిన్స్ ఇస్తూ శివ కుమార్ కనిపించారు. దీంతో నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం, డ్రగ్స్ అమ్మడం వంటి పనులు చేయడం లేదు కదా అంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఆ షాప్ తనదే ఉండొచ్చిన కూడా అంటున్నారు.
టాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసిన శివ కుమార్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం అంటూ జరగదని కొందరు నెటిజన్లు తెలుపుతున్నారు. అదంతా ఏదైనా సినిమా, వెబ్ సీరిస్ కోసం ఉండొచ్చని పేర్కొంటున్నారు. మెడికల్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసే అవసరం ఆయనకు లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే, అసలు విషయం తెలియాల్సి ఉంది.