
గతేడాది పుష్ప-2తో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. ఈ ఏడాది కూడా ఛావా మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది. వరుస సినిమాలతో రష్మిక దూసుకెళ్తోంది. ఇటీవలే కుబేరా మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలోనే ఆమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీలో కనిపించనుంది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే శ్రీవల్లికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్పై చాలాసార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్తో జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే రష్మిక.. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కింగ్డమ్ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ పోస్ట్ చేయగా.. ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. ఆ రోజు విజయ్ దేవరకొండ ఫైర్ చూడాలని ఉందంటూ పోస్ట్ చేసింది. గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండతో పాటు ముగ్గురు జీనియస్లు కలిసి సృష్టించిన చిత్రం కోసం ఎంతో ఆసక్తిగదా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన విజయ్ దేవరకొండ సైతం రష్మికకు రిప్లై ఇచ్చాడు. రస్సీలు అంటూ లవ్ సింబల్తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Rushhielu ❤️
Enjoy this one - #Kingdom 🤗— Vijay Deverakonda (@TheDeverakonda) July 27, 2025