
సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. రీసెంట్‌గా అక్కినేని నాగార్జున కుటంబంతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కూడా శుభవార్తలు విన్నాం. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna)లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. సోషల్‌మీడియాలో అయితే, పాన్ ఇండియా రేంజ్‌లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఈ జోడీ మాత్రం తమకు ఏమ్ తెలియనట్లు సైలెంట్‌గా ఉంది. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణెలతో పాటు చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు తమ అభిమానులతో పంచుకున్నారు. నేటి ప్రపంచంలో ఎవరూ కూడా తమ ప్రేమ,పెళ్లి విషయాల్ని దాచుకోవడం లేదు. సమయం వచ్చినప్పడు చెప్పేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది శుభాకాంక్షలు చెబుతున్నారు. కానీ, ఈ జంట మాత్రం ఇలాంటి సమయంలో చాలా గుంభనంగా ఉంది. కనీసం ఇవన్ని రూమర్స్ మాత్రమే అని కూడా వారు తమ అభిమానులకు చెప్పలేదు. నిజమే అయితే, కనీసం తమ ఫ్యాన్స్‌కు కూడా చెప్పకుండా ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒక లోకేషన్‌లో కనిపించడం చూశాం. విజయ్ ఇంట్లో రష్మిక ఫోటోలు దిగడం, పుట్టినరోజు సమయంలో ఒకే ప్రదేశానికి వెకేషన్ ప్లాన్ చేయడం వంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా పలు ఫోటోలతో అభిమానులే డీకోడ్ చేశారు. ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచారంటే తప్పులేదు. కానీ, నిశ్చితార్థం విషయాన్ని కూడా అంత సీక్రెట్‌గా ఉంచడం ఎందుకు అనే సందేహం అందరిలో వస్తుంది. రష్మిక రీసెంట్‌గా తన కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది కానీ నిశ్చితార్థం గురించి మాత్రం చెప్పలేదు. ఇలాంటి విషయాల్లో ఇంత రహస్యం అవసరమా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.