
టాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరున్న జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్, ఫెస్టివల్స్లో సందడి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ.
తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్గా మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు.
అయితే ఈ పరేడ్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు. పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్‌ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
These two giving off some serious newlywed energy. 😍 The chemistry is unreal ❤️☺️
They are giving major newly husband-wife vibes. Just saying.😉❤️#RashmikaMandanna ❤️#VijayDeverakonda ❤️ pic.twitter.com/0WsTeobHDZ— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 18, 2025