
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 25న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. తాజాగా డిసెంబరు 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
24న ప్రారంభం
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘వీరసింహా రెడ్డి’ (2023). వీరి కాంబినేషన్‌లో రానున్న ద్వితీయ చిత్రం ‘ఎన్‌బీకే 111’ (వర్కింగ్ టైటిల్). వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రారంభం కానుంది.