నందమూరి బాలకృష్ణ అనే పేరు కేవలం సినిమాల వరకే పనికొస్తుంది. ఎందుకంటే ఆ పేరుకు తగ్గట్లుగా బయట ఎక్కడా కూడా ప్రవర్తించిన దాఖలాలు లేవు. గతంలో ఇప్పటికే చాలాసార్లు అభాసుపాలైనప్పటికీ.. ఆయన తీరులో ఎలాంటి మార్పులైతే రావడం లేదు. తాజాగా మరోసారి ఓ అభిమానిపై ఎప్పటిలాగే నోరు పారేసుకున్నారు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అభిమానిపై దురుసుగా ప్రవర్తించాడు.
అసలు ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నాడు? అంటూ అతనివైపు వేలు చూపిస్తూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం ఈవెంట్‌లో కూడా వీడు కనపడకూడదని తన సెక్యూరిటీకి ఆదేశాలిచ్చాడ. బాలకృష్ణ తీరుతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇది చూసిన నెటిజన్స్ బాలకృష్ణ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులపై కోపం ప్రదర్శించడమేంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అఖండ-2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్ లాంఛ్ కోసం వైజాగ్ వెళ్లగా ఈ సంఘటన జరిగింది.
హే… వెళ్లు వెనక్కి అంటూ అభిమానిని హెచ్చరించిన బాలకృష్ణ
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఫోటో దిగడానికి వచ్చిన అభిమానిపై కోపం వ్యక్తం చేస్తూ,
“వీడు సాయంత్రం కూడా కనిపడకూడదు” అంటూ హుకుం జారీ చేసిన బాలయ్య pic.twitter.com/2yuv7hGKSi— greatandhra (@greatandhranews) November 18, 2025


