హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు (జనవరి 3) సందర్భంగా ఆయన నటిస్తున్న ‘హైందవ, రామమ్, టైసన్ నాయుడు’ సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘హైందవ’ ఒకటì . లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్. శివన్ రామకృష్ణ సమర్పణలో మూన్ షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
అదేవిధంగా లోకమాన్య దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామమ్’. ‘ది రైజ్ ఆఫ్ అకీరా’ అన్నాది ట్యాగ్ లైన్. దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్‌పై ప్రోడ్యూసర్స్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లుక్‌ని రిలీజ్ చేసింది యూనిట్. అలాగే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమా ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.


