ఫైమా.. లేడీ కమెడియన్‌గా చాలా పాపులర్. పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్.. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న తల్లికి ఓ ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యం అని చెప్పింది.
ప్రియుడిని పరిచయం చేసిన కమెడియన్
అనుకున్నట్లుగానే బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే తల్లి కోసం ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. కమెడియన్ ప్రవీణ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫైమా.. ఒకానొక సమయంలో తమది స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. 2024లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడి పేరు కూడా ప్రవీణ్ కావడం గమనార్హం. తాజాగా ప్రవీణ్ నాయక్ బర్త్‌డే సందర్భంగా అతడికో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
బర్త్‌డే సర్‌ప్రైజ్
షాపింగ్ పేరుతో మాల్‌కు తీసుకెళ్లి అక్కడ అతడిపై బెలూన్ల వర్షం కురిపించింది. ప్రియుడితో కేక్ కట్ చేయించింది. తర్వాత ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చి అతడితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో నేను చేసిన ఫస్ట్ సెలబ్రేషన్.. హ్యాపీ బర్త్‌డే ప్రవీనూ..' అని క్యాప్షన్ జోడించింది.


