2026నే టార్గెట్ చేసిన స్టార్ హీరోలు.. ఎవరికి కలిసొస్తుందో? | 2026 To Be A Big Year For Telugu Cinema: Chiranjeevi, Prabhas, NTR, Ram Charan And More Star In Multiple Big Releases | Sakshi
Sakshi News home page

Upcoming Movies In 2026: ఇది 'స్టార్' ఇయర్.. సినిమాలే సినిమాలు

Jan 3 2026 8:59 PM | Updated on Jan 4 2026 4:35 PM

2026 Upcoming Telugu Movies And Details

గతేడాది చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు.. థియేటర్లలో కనిపించలేదు. కారణం ఏదైనా గానీ ఈ ఏడాది మాత్రం తలో రెండుసార్లు కనిపించబోతున్నారు. వీళ్లతో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా 2026నే టార్గెట్ చేశారు. ఒకటి రెండు కాదు 10కి పైగా భారీ బడ్జెట్ లేదా బజ్ ఉన్న చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటిపై హైప్ ఎలా ఉంది?

సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలంటే 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు'. వీటిలో ప్రభాస్ చిత్రానికి ట్రైలర్స్‌తో బజ్ వచ్చింది. హారర్ కామెడీ కాబట్టి క్లిక్ అయ్యే ఛాన్సుంది. చిరంజీవి మూవీని కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ చేసి తీశారు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ బట్టి చూడాలా వద్దా అని చాలామంది డిసైడ్ అయ్యే అవకాశముంది.

(ఇదీ చదవండి: బ్లూ డ్రమ్‌ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్‌కి రెడీ)

వీటి తర్వాత అంటే మార్చిలో ప్యారడైజ్', 'పెద్ది' చిత్రాలు రాబోతున్నాయి. నాని 'ప్యారడైజ్', రామ్ చరణ్ 'పెద్ది'.. ఒకరోజు గ్యాప్‌లో థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ప్రస్తుతం బోలెడంత హైప్ ఉంది. కంటెంట్ కూడా అదే రేంజులో ఉంటే బ్లాక్ బస్టర్ టాక్ గ్యారంటీ.

ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రానుంది. దీనిపై రీమేక్ అని రూమర్ చాన్నాళ్లుగా వస్తుంది. టీమ్ మాత్రం అలాంటిదేం లేదని అంటోంది. ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా బయటకు వస్తే అప్పుడు హైప్ పెరగడం, తగ్గడం లాంటివి ఉంటాయి. జూన్ లేదా జూలైలో చిరంజీవి నుంచి ఈ ఏడాది మరో మూవీ వచ్చే అవకాశముంది. అదే 'విశ్వంభర'. ఇప్పటికే ఇది రిలీజైపోవాలి. కానీ గ్రాఫిక్స్ వచ్చిన ఘోరమైన విమర్శల దెబ్బకు ఆలస్యమైపోయింది. ఈ మూవీపై అయితే ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాల్లేవు.

ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే భారీ సినిమాల్లో ప్రభాస్ 'ఫౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగన్'. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటివరకు పోస్టర్స్ కూడా పెద్దగా రాలేదు. అలా అని బజ్ లేదనుకుంటే పొరపాటే. హైప్ అయితే చాలానే ఉంది. ప్రభాస్‌ది పీరియాడికల్ వార్ డ్రామా కాగా.. తారక్‌ది మూవీ. ఇవి ఏ మాత్రం క్లిక్ అయినా సరే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ గ్యారంటీ.

పైనవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు. ఇవి కాకుండా ఈ ఏడాది రిలీజయ్యే వాటిలో డకాయిట్, స్వయంభు, గూఢచారి 2, రౌడీ జనార్ధన, వృషకర్మ లాంటి మూవీస్ ఉన్నాయి. వీటిలో అడివి శేష్‌వి రెండున్నాయి. ఇతడి నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయిపోయింది. కానీ గట్టిగానే హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.

మరోవైపు నిఖిల్ చేసిన పీరియాడికల్ డ్రామా 'స్వయంభు', విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', నాగచైతన్య 'వృషకర్మ'పై ప్రస్తుతానికి పెద్దగా బజ్ లేదు గానీ కంటెంట్‌తో హిట్ కొట్టే ఛాన్సులు వీటికి చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?

(ఇదీ చదవండి: 'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. ఇది రీమేకేగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement