తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.
అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్‌గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్‌లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది.


