బ్లూ డ్రమ్‌ కేసు గుర్తుందా? దీనిపై వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్‌కి రెడీ | Honeymoon Se Hatya OTT Series Details Latest | Sakshi
Sakshi News home page

OTT: సిరీస్‌గా ఐదు షాకింగ్ ఘటనలు.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Jan 3 2026 6:32 PM | Updated on Jan 3 2026 7:06 PM

Honeymoon Se Hatya OTT Series Details Latest

గత కొన్నేళ్ల కాలంలో భర్తల్ని భార్యలు రకరకాలుగా చంపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ మహిళ.. తన భర్త శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్‌లో దాచిపెడితే, మరో భార్య హనీమూన్‌కి తీసుకెళ్లి భర్తని చంపించింది. ఈ వార్తలని మీరు చూడటమో చదవడమో చేసే ఉంటారు. ఇప్పుడు ఈ సంఘటనలపై ఏకంగా వెబ్ సిరీస్ తీశారు. దాన్ని స్ట్రీమింగ్‌కి సిద్ధం చేశారు. ఇంతకీ ఇది ఎ‍ప్పుడు ఏ ఓటీటీలోకి రానుంది?

భర్తల్ని భార్యలు హ*త్య చేయించడం లాంటి సంఘటనలు గతేడాది ఎక్కువగా విన్నాం, చూశాం. అలాంటి ఓ ఐదింటిని తీసుకుని ఇప్పుడు 'హనీమూన్ సే హత్య' పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌గా తీశారు. జీ5 ఓటీటీలో ఈనెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఇందులో నీలం రంగు డ్రమ్ కేసు, హనీమూన్ కేసుతో పాటు పాటు మరో మూడు కేసుల్ని కూడా చూపించబోతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్లూ డ్రమ్ కేసు విషయానికొస్తే.. మర్చంటే నేవీ ఆఫీసర్ సౌరభ్, ముస్కాన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు భర్తని కాదనుకున్న ముస్కాన్.. ప్రియుడి సాహిల్‌తో కలిసి సౌరభ్‌ని కిరాతకంగా చంపేసింది. ఆపై శరీర భాగాల్ని నీలం రంగు డ్రమ్‌లో పెట్టి సీల్ చేసింది. తన తండ్రి డ్రమ్‌లో ఉన్నాడని సౌరభ్ కుమార్తె.. ఇరుగు పొరుగువాళ్లకు చెప్పడం వల్లే ఈ ఉదంతం బయటపడింది. ఉత్తరప్రదేశ్‍‌లోని మీరట్‌లో ఇది చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్, సాహిల్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారు.

హనీమూన్ హత్య విషయానికొస్తే మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ.. సోనమ్‌ని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. తర్వాత వీళ్లిద్దరూ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో హత్య అని అనుమానించారు. భార్య సోనమ్ కోసం గాలించగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ప్రత్య‍క్షమైంది. ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించినట్లు ఒప్పుకొంది. 

(ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)

Advertisement
 
Advertisement
Advertisement