క్వీన్‌ ఆఫ్‌ ‘మార్క్‌’గా దీప్శిఖ చంద్రన్.. ఫ్యాన్స్‌ ఫిదా | Deepshikha Set To Make A Powerful Kannada debut With Mark | Sakshi
Sakshi News home page

క్వీన్‌ ఆఫ్‌ ‘మార్క్‌’గా దీప్శిఖ చంద్రన్.. ఫ్యాన్స్‌ ఫిదా

Jan 3 2026 2:36 PM | Updated on Jan 3 2026 2:47 PM

Deepshikha Set To Make A Powerful Kannada debut With Mark

కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మార్క్’.డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దీప్శిఖ చంద్రన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు

కన్నడ సినీ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దీప్శిఖ చంద్రన్.. ఈ చిత్రంలో బలమైన పాత్రలో కనిపించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఆమె యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె ధీరవనిత పాత్రకు మహిళా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు దీప్శిఖను "మార్క్ క్వీన్", "క్వీన్ ఆఫ్ మార్క్" అని పిలుచుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పరిమితంగా ఉంటాయి కానీ, ‘మార్క్’లో దీప్శిఖ పాత్ర బలంగా నిలిచి సినిమాకు మరింత బలం చేకూర్చింది. 

పాజిటివ్ మౌత్ టాక్, థియేటర్ స్పందనతో ‘మార్క్’ కన్నడ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ విజయం దీప్శిఖ చంద్రన్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడ ప్రేక్షకులకు కొత్త క్రష్‌గా మారిన దీప్శిఖకు గుర్తింపు, ఆదరణ పెరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement