
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా కోసం అఖండ-2ను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దీంతో బాలయ్య సినిమా ఇంకెప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా లేదా అంతకుముందే డిసెంబర్లోనే రానుందా అని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అఖండ-2 విడుదల తేదీని ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.
(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)
తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ మూవీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చేశారు. డిసెంబర్ తొలివారంలోనే అఖండ-2 రానుందని చెప్పేశారు. అయితే విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ లెక్కన డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ కావొచ్చని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ రోజైనా రిలీజవుతుందా? లేదంటే సంక్రాంతికి పోస్ట్‌పోన్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
#Akhanda2 కొత్త రిలీజ్ డేట్ బయటపెట్టిన బాలయ్య 🔱🔥#NandamuriBalakrishna #TeluguFilmNagar pic.twitter.com/uOKb4sZcFn
— Telugu FilmNagar (@telugufilmnagar) September 4, 2025