
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు.
అయితే అఖండ-2 ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 25న అఖండ-2 రావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పోస్ట్ చేసింది. అయితే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరింత వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్ మెరుగులు దిద్దేందుకే పోస్ట్‌పోన్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
(ఇది చదవండి: బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా)
అయితే గతంలోనే అఖండ-2 వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ఎందుకంటే అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ కూడా రిలీజ్ కానుంది. ఆ కారణం వల్లే బాలయ్య సినిమాను వాయిదా వేయనున్నారని టాక్ వినిపించింది. అందరూ ఊహించనట్లుగానే ఇవాల్టి ప్రకటనతో అదే నిజమైంది. అఖండ-2 తప్పుకోవడంతో పవన్ కల్యాణ్ ఓజీకి బాక్సాఫీస్ వద్ద రిలీఫ్ లభించింది. లేకపోతే బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది. మరోవైపు ఓజీ కోసమే ఈ మూవీని వాయిదా వేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. అఖండ- 2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తోంది.
#Akhanda2 - AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025