ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని దంపతుల ఆత్మహత్య (?) కలకలం రేపింది. పదేళ్లు కలతలు లేకుండా కాపురం చేసిన భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తొలుత సంఘటనా కల్పించిన దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది.
సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని అటల్ ఆవాస్ కాలనీలో ఈ హృదయ విదారక సంఘటన సంచలనం సృష్టించింది. తొలుత భార్యభర్తల వివాదం అనుకున్నారు అంతా. కానీ లిప్‌స్టిక్‌తో గోడలపై రాసిన మెసేజ్ పోలీసులను నివ్వెర పోయేలా చేసింది. దీంతి ఇది హత్య లేక ఆత్మహత్యా అనే అనుమానాలను దారి తీసింది. నవంబర్ 24న, రాజ్ లేదా నేహా మధ్యాహ్నం వరకు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన నేహా తల్లి రీనా అక్కడి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కంటతడి పెట్టించే దృశ్యాలు
మృతులు శివాని తండే అలియాస్ నేహా, రాజ్‌ది ప్రేమ వివాహం. వీరు ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు చిన్న పిల్లలున్నారు. ముప్పై ఏళ్ల నేహా, మంచం మీద చనిపోయి కనిపించగా, ఆమె భర్త రాజ్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. గోడలపై లిపిస్టిక్‌తో రాసిన రాతలు.. మృతుల ఇంటి లోపల, ఈ భయంకర దృశ్యాలు పలువురి కంట తడిపెట్టించాయి.
ఇంతకీ ఏముందీ ఆ మెసేజ్‌లో
గోడలపై రాసిన ఆ మెసేజ్‌లో రాజేష్ విశ్వాస్ అనే వ్యక్తి పేరు ,మొబైల్ నంబర్ ఉన్నాయి. అతని కారణంగా చనిపోతున్నామని, తమ సంసారంలో కలతలు రేపాడని ఆరోపించరాఉ. పిల్లలూ .. ఐ లవ్ యూ అంటూ మరో భావోద్వేగ నోట్ రాశారు. ఆ సందేశంలో భార్య ఫోన్ కాల్స్ కారణంగా తరచుగా గొడవలు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానాలతో ఇద్దరి మధ్యా మధ్య తరచూ గొడవలు జరిగేవని పొరుగువారు వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు నేహా మెడపై గీతలు పడిన గుర్తులను కనుగొన్నారు. దీంతో గొంతు కోసి భార్యని చంపిన రాజ్, ఆ తరువాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు బావిస్తున్నారు. గది నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ , గోడల మీద రాతల ఆధారం హత్య-ఆత్మహత్య అనే వాదనకు బలం చేకూరుస్తోంది.


