అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం | AP Couple Died In USA Road Accident | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం

Jan 5 2026 11:02 AM | Updated on Jan 5 2026 1:44 PM

AP Couple Died In USA Road Accident

వాషింగ్టన్‌ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్‌, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తన్నాడు. 

ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. 

వీరిది  భారత్‌లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే  కిషోర్‌ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement