సాక్షి, విజయవాడ: ఏపీలో 2018 గ్రూప్-1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు.. 2018 రిక్రూట్‌మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మందిని సాధారణ పరిపాలన శాఖ (GAD)కి సీఎస్ అటాచ్ చేశారు.
ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఎస్.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి.. జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


