రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాకు పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై రామ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా వీడియోను పంచుకున్నారు. ఇందులో సముద్రంలో సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో వీడియో చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు.


