రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie).. చాలామంది ఈ సినిమా మీద మనసు పారేసుకున్నారు. జనాలను అంత బాగా మెప్పిస్తోందీ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రయూనిట్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఫ్రీ టికెట్ తీసుకోండి
ఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఏ థియేటర్‌కు అయినా వెళ్లండి. కౌంటర్ దగ్గరకు వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకోండి.. ఉచితంగా సినిమా చూడండి.. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో ఏరియా.. అక్కడున్న థియేటర్‌ల వివరాలను సైతం పొందుపరిచాడు. ఆ లిస్ట్ కింద చూసేయండి..
థియేటర్ల లిస్ట్
విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ: పద్మప్రియ కాంప్లెక్స్
శ్రీకాకుళం: సూర్య మహల్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
ఏలూరు: అంబిక కాంప్లెక్స్
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
మచిలీపట్నం: సిరి కృష్ణ
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత 2 షోస్, మానస 2 షోస్
చిత్తూరు: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
కర్నూలు: ఆనంద్
నంద్యాల: నిధి
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: ఎస్‌వీ సినీ మాక్స్
హిందూపూర్: గురునాథ్
సినిమా
ఈ ఆఫర్ ఈరోజు (నవంబర్ 27న) మాత్రమే వర్తిస్తుంది. సినిమా విషయానికి వస్తే.. అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీయే రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.


