హాంకాంగ్: వందల జనావాసాలు, చిన్నారుల ఆటపాటలతో ఎప్పుడూ కిటకిటలాడే హాంకాంగ్‌లోని ‘వాంగ్ ఫుక్ కోర్ట్’ ఆకాశహర్మ్యాలు బుధవారం ఒక్కసారిగా జనం హాహాకారాలతో మృత్యుభవనాలుగా మారాయి.
అగ్నికీలలు బహుళ అంతస్తుల భవన సముదాయాలను చుట్టుముట్టడంతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు.
అప్పటికే వ్యాపించిన మంటలకు 44 మంది సజీవదహనమయ్యారు.
బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో భవనాల చుట్టూ ఉన్న ఆకుపచ్చని వస్త్రానికి తొలుత నిప్పు అంటుకుని, తర్వాత అది వెదురు సపోర్ట్ నిర్మాణాలను అంటుకుని అంతటా వ్యాపించిందని భావిస్తున్నారు.


