కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కు హాజరైన కీర్తి సురేశ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించింది.
ఈ ఈవెంట్లో కీర్తి సురేశ్కు ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు చిరంజీవి కంటే విజయ్ బాగా డ్యాన్స్ చేస్తారని అన్నారు.. అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలా మీరు ఎందుకు అనాల్సి వచ్చిందని ఆమెను ప్రశ్నించారు. దీనికి కీర్తి సురేశ్ స్పందించింది.
కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. 'నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. కానీ నేను దళపతి విజయ్ సర్కు వీరాభిమానిని. చిరంజీవి సార్కు కూడా ఈ విషయం గురించి తెలుసు. నేను, మెగాస్టార్ గతంలో సెట్స్‌లో దీనిపై సరదాగా మాట్లాడుకున్నాం. ఆయన దానిని స్పోర్టివ్గా తీసుకున్నారు. చిరంజీవి సర్‌పై నాకు చాలా గౌరవం ఉంది. అందుకే నాకు అనిపించింది చెప్పాను. కొన్నిసార్లు నాకు ఏమి అనిపిస్తుందో చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది.' అని అన్నారు.
Here is the video of the interview. pic.twitter.com/X0ZbUTNXEa
— MK (@MK_VOXX) November 26, 2025


