ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు | Rasi Phalalu: Daily Horoscope On 24 11 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి కొత్త అవకాశాలు, సంఘంలో గౌరవమర్యాదలు

Nov 24 2025 12:53 AM | Updated on Nov 24 2025 12:54 AM

Rasi Phalalu: Daily Horoscope On 24 11 2025 In Telugu

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: శు.చవితి సా.6.02 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పూర్వాషాఢ రా.7.42 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: తె.4.10 నుండి 5.52 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు, అమృత ఘడియలు: ప.2.24 నుండి 4.01 వరకు.

సూర్యోదయం :    6.13
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు కొంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. సంఘంలో గౌరవం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: మిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement