బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ ఏడాది ఎడాపెడా సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్దిలోనూ కనిపించనుంది. ఇక హిందీలో హిట్తో సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలతో అలరిస్తోంది. అలా ఈ ఏడాదిలో వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి.
ఈ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది దేవర భామ. ఈ సినిమా దసరా కనుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.98.35 కోట్లు వసూలు చేసింది.
దాదాపు నెలన్నర్ర రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తోంది సన్నీ సంస్కారీ కి తులసి కుమారి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు.
Muhurat nikal gaya guys 🥳#SSKTKonNetflix pic.twitter.com/xU2N5bKcej
— Netflix India (@NetflixIndia) November 26, 2025


