సింగర్గా మాత్రమే కాదు.. నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ఆండ్రియా జెరెమా. విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ప్రియులను అలరిస్తోంది. కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్లోనూ ఆమె దాదాపు సుపరిచితమే. ఈ ఏడాది మాస్క్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. కవిన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అయితే ఆండ్రియా పిశాచి-2 అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రకటించి మూడేళ్లయినా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్ సీన్‌లో కనిపించే పోస్టర్పై అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆండ్రియా.. ఆ వివాదస్పద సీన్ గురించి మాట్లాడింది. స్క్రిప్ట్ ప్రారంభంలోనే ఆ బోల్డ్ సీన్ చేర్చారని పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో ఆ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. ఈ చిత్రంలో ఎవరూ కూడా నగ్నంగా కనిపించరని పేర్కొంది. తనకు డైరెక్టర్ మిస్కిన్పై పూర్తి నమ్మకముందని.. ఆయన కథకు అవసరమైతేనే అలాంటి సీన్స్ పెడతారని వివరించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కానీ అవన్నీ నగ్నంగా మాత్రం ఉండవని చెప్పింది. ఆయన ఇప్పటికే పలువురు స్టార్ నటులతో సినిమాలు చేశారని గుర్తు చేసింది. ఒకవేళ డైరెక్టర్ ఆ సీన్ అవసరమని భావిస్తే అతని దృష్టి కోణం అది కాదని.. ఆ సీన్ వెనకాల కచ్చితంగా అర్థముంటుందని ఆండ్రియా చెబుతోంది.


