తండ్రి సాయికుమార్ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది.. తొలి రెండు సినిమాలతోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరసగా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. వచ్చే నెలలో 'శంభాల' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆ బిజీలో ఉన్నాడు. మరోవైపు తాను మళ్లీ తండ్రి కాబోతున్నాననే శుభవార్త కూడా చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: మహేశ్‌తో సినిమా ఫ్లాప్.. తొలిసారి ఆ విషయం అర్థమైంది: రకుల్)
2011లో 'ప్రేమకావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది.. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రెండో మూవీ 'లవ్ లీ' కూడా హిట్ అయింది. తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు గానీ అవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. గతేడాది ఎలాంటి చిత్రంతోనూ రాలేదు. ఈ సంవత్సరం మాత్రం 'షణ్ముఖ' అనే మూవీతో వచ్చాడు. త్వరలో క్రిస్మస్ సందర్భంగా 'శంభాల' అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.
వ్యక్తిగత జీవితానికొస్తే.. 2014లో అరుణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీళ్లకు ఓ కూతురు పుట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆది.. మరోసారి తండ్రి కాబోతున్నాడు. వచ్చే జనవరిలో తన భార్య, బిడ్డని ప్రసవించనుందని.. తాము ముగ్గురు నుంచి నలుగురుం కాబోతున్నామని ఆది.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


