రకుల్ ప్రీత్ సింగ్.. కొన్నేళ్ల ముందు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. అలాంటిది ఉన్నట్లుండి సడన్‌గా మాయమైపోయింది. ప్రస్తుతానికైతే హిందీలో మాత్రమే మూవీస్ చేస్తోంది. రీసెంట్‌గా ఈమె నటించిన 'దే దే ప్యార్ దే 2' థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. టాలీవుడ్‌లో హిట్స్, ఫ్లాప్ అందుకోవడం లాంటి విషయాల గురించి మాట్లాడింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)
'తెలుగులో వరసగా 8-9 సినిమాలతో హిట్ కొట్టిన తర్వాత 'స్పైడర్' చేశా. ఇది నా కెరీర్‌లో తొలి ఫ్లాప్. మన అంచనాలు దెబ్బతిన్నప్పుడు ఎలా ఉంటుందో మొదటిసారి నాకు అర్థమైంది. చెప్పాలంటే చాలా భారంగా అనిపించింది. ఆ చిత్రం తర్వాత మానసికంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టేసింది' అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.
మహేశ్-మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 2017లో తెలుగు, తమిళంలో రిలీజైంది. ఫ్లాప్ అయింది. అయితే రకుల్.. ఇది తనకు తొలి ఫ్లాప్ అని చెప్పింది గానీ అంతకుముందే ఈమెకు టాలీవుడ్‌లో మూడు నాలుగు ఫెయిల్యూర్స్ పడ్డాయి. కానీ మహేశ్ మూవీనే తనకు మొదటి ఫ్లాప్ అన్నట్లు చెప్పుకొచ్చింది. మర్చిపోయిందా లేదంటే కావాలనే చెప్పిందా అనేది అర్థం కాలేదు.
(ఇదీ చదవండి: వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు: గిరిజా ఓక్)
2011లో 'కెరటం' అనే సినిమాతో రకుల్.. తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫ్లాప్. తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ అవడంతో తెలుగులో ఛాన్సులొచ్చాయి. అలా 'రఫ్' చేయగా ఇది ఫెయిలైంది. దీని తర్వాత చేసిన లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో సక్సెస్ అయ్యాయి. అనంతరం చేసిన 'కిక్ 2' డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన బ్రూస్ లీ యావరేజ్ అనిపించుకోగా.. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు హిట్ అయ్యాయి. దీని తర్వాత చేసిన 'విన్నర్' ఫ్లాప్ అయింది. అనంతరం మళ్లీ రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక మళ్లీ ఆకట్టుకోగా.. తర్వాత చేసిన 'స్పైడర్' ఫ్లాప్ అయింది.
మహేశ్ సినిమా తర్వాత రకుల్ దాదాపు టాలీవుడ్‌కి దూరమైపోయింది. చివరగా 'కొండపొలం' అనే మూవీలో డీ గ్లామర్ రోల్ చేసింది గానీ వర్కౌట్ కాలేదు. వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు హిందీలో మూవీస్ చేస్తోంది.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'లో హీరోయిన్ ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా)


