spyder movie
-
ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్గా 'రాజాసాబ్'
'నాన్న-పులి' కథ చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం చెప్పినా నిజాయితీగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే రిస్క్. వందల కోట్లతో డీల్ చేసే సినిమా ఇండస్ట్రీలోనూ ప్రేక్షకులతో పరాచకాలు ఆడకూడదు. ఎందుకంటే దక్షిణాదిలో కొందరు దర్శకులు సినిమాలతో బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ తమ క్రియేటివిటీతో థియేటర్‌కి వచ్చేవాళ్లని మోసం చేస్తున్నారు. తాజాగా వచ్చిన 'రాజాసాబ్'తో మరోసారి అలాంటిదే రిపీటైంది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)'రాజాసాబ్'నే తీసుకుందాం. ప్రభాస్.. ఓల్డ్ గెటప్‌ని ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. ట్రైలర్లో చూపించారు. ఈ గెటప్‌కి అదిరిపోయే డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్ ఉందని ఊరించి అభిమానులకు ఆశలు పెంచేశారు. కట్ చేస్తే మూడు గంటల సినిమాలో దీనికి సంబంధించిన ఒక్క సీన్ లేదు. కథకు అడ్డొస్తుందని తీసేశారా? సీక్వెల్ కోసం దాచుకున్నారా? తెలియదు. ఇప్పుడొచ్చిన ఫస్ట్ పార్ట్‌లో ఇది ఉండదు అని ఫిక్సయినప్పుడు.. ప్రమోషన్లలో వీటిని ఉపయోగించడం అవసరమా? అసలు సినిమాకు కాస్తోకూస్తో హైప్ ఏర్పడిందే ఈ లుక్ వల్ల. అలాంటి ఈ గెటప్ సీన్స్ తీసేస్తే.. ప్రేక్షకుల్ని మోసం చేసినట్లేగా!గతంలోనూ ఇలాంటి షాకులే స్టార్ హీరోల సినిమాలతో దర్శకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళ దర్శకుడు శంకర్.. చాన్నాళ్ల క్రితమే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. 'రోబో' తర్వాత విక్రమ్ హీరోగా 'ఐ' అనే స్ట్రెయిట్ సినిమా తీశాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో విక్రమ్ బీస్ట్(జంతువు గెటప్)లా కనిపించడం చూసి అంతా వావ్ అని ఆశ్చర్యపోయారు. లుక్కే ఇంత బాగుందంటే సినిమాలో ఆయా సీన్స్ ఇంకెలా ఉంటాయోనని తెగ ఊహించేసుకున్నారు. కట్ చూస్తే పాటలో ఒకటి రెండు సీన్స్‌లో మాత్రమే దీన్ని చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)మహేశ్ బాబు 'స్పైడర్' సినిమా నుంచి తొలి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు.. మెషీన్ స్పైడర్‌ని చూపించి హైప్ ఇచ్చారు. కానీ దీన్ని సినిమాలో ఎక్కడా పెట్టలేదు. ప్రమోషన్ కోసమే చేసింది ఇది అని అభిమానులు, ప్రేక్షకులకు ముందే చెప్పి ఉంటే బాగుండేది. కానీ మూవీ టీమ్ అలా చేయలేదు. తీరా సినిమా రిలీజయ్యా ప్రేక్షకులు.. చాలా డిసప్పాయింట్ అయ్యారు. దర్శకుడిని గట్టిగా తిట్టుకున్నారు.రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లో గోల్డెన్ వాచీలని హైలైట్ చేసి చూపించారు. దీంతో చాలామంది ఆడియెన్స్.. ఇదేదో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అని రకరకాల థియరీలు వేసుకున్నారు. అది వాచీల స్మగ్లింగ్ కోసమే అని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీరా రిలీజైన తర్వాత మూవీ చూస్తే ఈ వాచీల కాన్సెప్ట్‌కి సినిమాలో అసలు ప్రాధాన్యమే లేదు. ఇది తెలిసి చాలామంది ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. ఇలా పలుమార్లు పలువురు దర్శకులు.. ఫస్ట్ లుక్‌తో ఒకలా, మూవీలో ఆ కాన్సెప్ట్ మరోలా చూపించి మోసం చేశారు!(ఇదీ చదవండి: జనవరి 10.. టాలీవుడ్ భయపడుతోందా?) -
మహేశ్‌తో సినిమా ఫ్లాప్.. మొదటిసారి ఆ విషయం అర్థమైంది
రకుల్ ప్రీత్ సింగ్.. కొన్నేళ్ల ముందు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. అలాంటిది ఉన్నట్లుండి సడన్‌గా మాయమైపోయింది. ప్రస్తుతానికైతే హిందీలో మాత్రమే మూవీస్ చేస్తోంది. రీసెంట్గా ఈమె నటించిన 'దే దే ప్యార్ దే 2' థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. టాలీవుడ్లో హిట్స్, ఫ్లాప్ అందుకోవడం లాంటి విషయాల గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)'తెలుగులో వరసగా 8-9 సినిమాలతో హిట్ కొట్టిన తర్వాత 'స్పైడర్' చేశా. ఇది నా కెరీర్లో తొలి ఫ్లాప్. మన అంచనాలు దెబ్బతిన్నప్పుడు ఎలా ఉంటుందో మొదటిసారి నాకు అర్థమైంది. చెప్పాలంటే చాలా భారంగా అనిపించింది. ఆ చిత్రం తర్వాత మానసికంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టేసింది' అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.మహేశ్-మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 2017లో తెలుగు, తమిళంలో రిలీజైంది. ఫ్లాప్ అయింది. అయితే రకుల్.. ఇది తనకు తొలి ఫ్లాప్ అని చెప్పింది గానీ అంతకుముందే ఈమెకు టాలీవుడ్లో మూడు నాలుగు ఫెయిల్యూర్స్ పడ్డాయి. కానీ మహేశ్ మూవీనే తనకు మొదటి ఫ్లాప్ అన్నట్లు చెప్పుకొచ్చింది. మర్చిపోయిందా లేదంటే కావాలనే చెప్పిందా అనేది అర్థం కాలేదు.(ఇదీ చదవండి: వస్తావా? గంటకు ఎంత? అని అడుగుతున్నారు: గిరిజా ఓక్)2011లో 'కెరటం' అనే సినిమాతో రకుల్.. తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఫ్లాప్. తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ అవడంతో తెలుగులో ఛాన్సులొచ్చాయి. అలా 'రఫ్' చేయగా ఇది ఫెయిలైంది. దీని తర్వాత చేసిన లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో సక్సెస్ అయ్యాయి. అనంతరం చేసిన 'కిక్ 2' డిజాస్టర్ అయింది. తర్వాత చేసిన బ్రూస్ లీ యావరేజ్ అనిపించుకోగా.. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు హిట్ అయ్యాయి. దీని తర్వాత చేసిన 'విన్నర్' ఫ్లాప్ అయింది. అనంతరం మళ్లీ రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక మళ్లీ ఆకట్టుకోగా.. తర్వాత చేసిన 'స్పైడర్' ఫ్లాప్ అయింది.మహేశ్ సినిమా తర్వాత రకుల్ దాదాపు టాలీవుడ్‌కి దూరమైపోయింది. చివరగా 'కొండపొలం' అనే మూవీలో డీ గ్లామర్ రోల్ చేసింది గానీ వర్కౌట్ కాలేదు. వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు హిందీలో మూవీస్ చేస్తోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'లో హీరోయిన్ ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా) -
పవన్ సినిమాతో చాలా నష్టపోయా, కెరీర్లోనే బిగ్గెస్ట్ డ్యామెజ్ : దిల్‌రాజు
పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయానని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వారీసు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. 2017లో ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్ కూడా ఆడలేదు. రెండు సినిమాలు ఒకేసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో చాలా నష్టపోయాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ కొట్టడంతో నేను నిలబడగలిగాను'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
బాహుబలి-2ని క్రాస్ చేసిన స్పైడర్!
సాక్షి, చెన్నై : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్ చేయటంతో ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్ దక్కింది. దీంతో మహేష్ స్పైడర్ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్ దర్శకుడు కావటం, సూర్య విలన్, మహేష్ క్రేజ్ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్ మెర్సల్ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం. -
నెక్ట్స్ ఏంటి?
అవును. వాట్ నెక్ట్స్? అని మూడు నెలలుగా రకుల్ గురించి చాలామంది మనసులో ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికినట్లే. ‘స్పైడర్’ సినిమా రిలీజ్ అయి మూడు నెలలు కావొస్తున్నా రకుల్ తెలుగులో నెక్ట్స్ సినిమా ఇంకా సైన్ చేయలేదేంటి? అన్నదే ఆ ప్రశ్న. ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తోన్న రకుల్ ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. డాక్టర్‌కు జోడీగా.. అదేనండి నాని సరసన హీరోయిన్గా రకుల్ చేయనున్నారట. ‘స్పైడర్’లో డాక్టర్‌గా చేసిన రకుల్ ఈ సినిమాలో డాక్టర్‌కి జోడీగా యాక్ట్ చేస్తారన్న మాట. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. -
మహేష్ తిరిగిచ్చేశాడు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తమిళ ఆడియన్స్ కు పరవాలేదనిపించినా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ సాధించినా.. బ్రేక్ ఈవెన్ కు రావటం కష్టమనే భావిస్తున్నారు. అయితే నిర్మాత కష్టాలను దృష్టిలో పెట్టుకోని మహేష్ మరోసారి తన రెమ్యూనరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గతంలో బ్రహ్మోత్సవం సినిమా సమయంలో కూడా మహేష్ తన పారితోషికాన్ని తిరిగిచ్చేసి నిర్మాతలను ఆదుకున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన స్పైడర్ కు మహేష్ 20 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నాడన్న వార్తలు వినిపించాయి. -
సూపర్ స్టార్ స్టామినా : 12 రోజుల్లో 150 కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. తెలుగు నాట పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు సాదించిన స్పైడర్ కు ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా అలరించాడు. తమిళనాట ఈ వారం సినిమా రిలీజ్ లు ఆగిపోవటం కూడా స్పైడర్ కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. -
'తొలగించకపోతే ఆందోళనలకు దిగుతాం..'
హైదరాబాద్ (రామాంతపూర్): ఇటీవల విడుదలైన స్పైడర్ చిత్రంలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం రామంతాపూర్‌లోని హిందూశ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది దళితులు ఎండక, వానకు శ్మశానంలోకష్టపడుతూ కాటికాపర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారిని ఈ చిత్రంలో కించపర్చడం తగదని ఆయన పేర్కొన్నారు. వెంటనే సన్నివేశాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో స్థానిక కాటికాపర్ల సంఘం ప్రతినిధులు జంగయ్య, పరుశురాం, సత్యనారాయణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’
‘‘మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో రెగ్యులర్ ఫార్మాట్ సినిమా తీయాలనుకోలేదు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశాం. డిఫరెంట్ సినిమాలు వచ్చినప్పుడే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. నిజమైన రివ్యూలు ప్రేక్షకులకు తెలుసు’’ అన్నారు మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్వకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ‘‘మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 51 కోట్లు వసూలు చేసింది’’ అని ‘ఠాగూర్’ మధు చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న మురుగదాస్ చెప్పిన విశేషాలు.. ► రెండు, మూడు సినిమాలు హిట్ అయితే చాలు.. ‘ఈ డైలాగ్ మార్చండి, ఆ ఆర్టిస్టు వద్దు’ అని కొందరు హీరోలు ఆంక్షలు పెడతారు. కానీ, మహేశ్‌లాంటి సూపర్‌స్టార్ అలాంటి కండీషన్స్ పెట్టలేదు. ► కథకు అనుగుణంగానే మహేశ్ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే హీరో క్యారెక్టర్ బలం తెలుస్తుంది. ఏ హీరో కూడా ఇంకో యాక్టర్‌కి (ఎస్.జె సూర్య)కి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అయితే స్క్రిప్ట్‌ని దృష్టిలో పెట్టుకుని మహేశ్ ఇచ్చారు. అందుకే మహేశ్ రియల్ హీరో. బాలీవుడ్ నుంచి కొందరు సినీ విశ్లేషకులు సినిమా బాగుందంటూ ఫోన్ చేశారు. ► హీరో పదిమంది విలన్స్‌ను కొడితే వాళ్లు గాల్లోకి లేచిపడటం, స్కిన్‌షో, రెగ్యులర్ సాంగ్స్‌తో సినిమాను తీయాలనుకోలేదు. అలాంటి సబ్జెక్ట్‌ను మహేశ్‌లాంటి సూపర్‌స్టార్‌తో డీల్ చేయాలనుకోలేదు. హీరోకు, విలన్‌కు స్ట్రాంగ్ వార్ జరుగుతున్నప్పుడు హీరోయిన్ పాత్రకు పెద్దగా స్పేస్ ఉండకపోవచ్చు. రకుల్ పాత్ర నిడివి తక్కువే అయి నప్పటికీ తనది కీ–రోల్. అద్భుతంగా నటించింది. ► డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకున్నాం. డిఫరెంట్ మూవీస్‌ను ప్రోత్సహించకపోతే ‘దంగల్, పీకే, భజరంగీ భాయిజాన్’ వంటి భిన్నమైన కాన్సెప్ట్ మూవీస్ వచ్చి ఉండేవి కాదు. ► తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. బీ,సీ సెంటర్లవారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ‘శ్రీమంతుడు’కంటే ‘స్పైడర్’కు తమిళనాడులో మంచి స్పందన వస్తోందని రిపోర్ట్స్ వస్తున్నాయి . మంచి ప్రయత్నం: రజనీకాంత్ ‘స్పైడర్’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రబృందాన్ని అభినందించారు. ఇదొక మంచి ప్రయత్నం అని కొనియాడారు. ‘‘మంచి మెసేజ్‌తో సినిమా చాలా బాగుంది. మురుగదాస్ ఈ సబ్జెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. మహేశ్ అత్యద్భుతంగా నటించాడు. ఒక స్టార్ హీరో అయ్యుండి విలన్‌కు ఇంపార్టెన్స్ ఉన్న కథను ఒప్పుకోవడం మహేశ్ గొప్పతనం’’ అని రజనీకాంత్ అన్నారు. -
ఓవర్సీస్ రికార్డ్: బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్ సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మూడు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే స్పైడర్ పది లక్షల డాలర్లు వసూళు చేసినట్టుగా ఫోర్బ్స్ సంస్థ ఓ వార్తలో పేర్కొంది. వారాంతంలో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ అయి ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా స్పైడర్ రికార్డ్ సృష్టించింది. స్పైడర్ కన్నా ముందు ధూమ్ 3, బాహుబలి 2 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవటంతో తొలివారాంతనికి స్పైడర్ మరిన్ని రికార్డ్ లు బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు. -
'స్పైడర్' మూవీ రివ్యూ
టైటిల్ : స్పైడర్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి, భరత్ సంగీతం : హారిష్ జయరాజ్ దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్ నిర్మాత : ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, మంజుల స్వరూప్ బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండం స్పైడర్ మీద అంచనాలను భారీగా పెంచేసింది. మరి ఆ అంచనాలను స్పైడర్ అందుకుందా..? బ్రహ్మాత్సవం తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ అభిమానులు స్పైడర్ తో ఖుషీ అయ్యారా..? కథ : శివ (మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరోలో కాల్ టాపింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటాడు. తన అర్హతలకు అంతకన్నా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా.. క్రైమ్ జరగటానికి ముందే ఆపే అవకాశం ఉండటంతో అదే ఉద్యోగాన్ని కోరి మరీ చేస్తుంటాడు. అలా ఎంతో మంది ఇబ్బందుల్లో పడకుండా ముందే తెలుసుకొని కాపాడతాడు. అయితే ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఆ అమ్మాయితో పాటు శివ స్నేహితురాలు కూడా హత్యకు గురవుతుంది. (సాక్షి రివ్యూస్) ఆ హత్యకు కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో శివకు భయం కలిగించే నిజాలు తెలుస్తాయి. శాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాదితో ఇబ్బంది పడే సైకో భైరవుడు (యస్ జే సూర్య) చిన్నతనం నుంచి ఎవరైన ఏడుస్తుంటే వారిని చూసి ఆనందపడటం భైరవుడి జబ్బు. అందుకోసం తానే హత్యలు చేయటం మొదలుపెడతాడు. చనిపోయిన వారి చుట్టూ జనం చేరి ఏడుస్తుంటే వారిని చూసి ఆనంద పడతుంటాడు. ఇలా వరుస హత్యలు చేస్తున్న భైరవుడు.. హైదరాబాద్ లో ఓ భారీ వినాశనానికి ప్లాన్ చేస్తాడు. భైరవుడు చేయాలనుకున్న వినాశనం ఏంటి..? ఆ ప్రమాదం నుంచి నగరాన్ని శివ కాపాడగలిగాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటలిజెన్స్ అధికారిగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో మహేష్ నటన అద్భుతమనే చెప్పాలి. అయితే సినిమా అంతా సీరియస్ మూడ్ లో సాగటంతో మహేష్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఆశించే వారికి మాత్రం నిరాశ తప్పదు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఆకట్టుకుంది. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించింది. పూర్తి యాక్షన్ జానర్ సినిమా కావటంతో ఆడియన్స్ కు రకుల్ గ్లామర్ రిలీఫ్ అనిపించటం ఖాయం. విలన్ గా ఎస్ జే సూర్య విశ్వరూపమే చూపించాడు. సైకోగా సూర్య నటన తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. సాంకేతిక నిపుణులు : కమర్షియల్ సినిమాతోనూ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటంలో తనకు తిరుగులేదని దర్శకుడు మురుగదాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తొలిసారిగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసిన మురుగదాస్, మహేష్ ను స్టైలిష్ కాప్ గా చూపించాడు. అయితే తెలుగునాట మహేష్ ఇమేజ్ కు తగ్గ కథా కథనాలను ఎంపిక చేయటంలో తడబడ్డాడు. మహేష్ ను కోలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయటంలో మాత్రం మురుగదాస్ సక్సెస్ సాధించాడు. తొలి భాగం కాస్త స్లో అయినా.. ద్వితీయార్థం మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్ లతో కథను పరిగెత్తించాడు. అయితే ఎక్కువ భాగం సినిమా తమిళ నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించటం కాస్త నిరాశపరుస్తుంది. హారిష్ జయరాజ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. విజువల్ గా బాగున్నాయి. (సాక్షి రివ్యూస్) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం హారిష్ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ లో సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మహేష్, యస్ జే సూర్యల నటన యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తెలుగు నేటివిటి పెద్దగా కనిపించకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
స్పైడర్‌పై ఎవరేమన్నారంటే...
సాక్షి, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ షోలు, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ షోలు పడిపోయాయి. స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా స్పైడర్ తెరకెక్కింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, సూర్య యాక్టింగ్ బాగుందని, అయితే నటనలో సూర్యకే ఎక్కువ మార్కులు వేయొచ్చని సినిమా చూసిన వారు అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తో హ్యారిస్ జైరాజ్ ఆకట్టుకున్నాడని, కెమెరా పనితనం అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం సినిమా బాగా కనెక్ట్ అయినట్లు చెబుతున్నారు. మురుగదాస్ మహేష్‌కు మరో బ్లాక్ బస్టర్ అందించారని అంటున్నారు. యూనిక్ సబ్జెక్ట్‌తో హీరోయిజం పెద్దగా ఎలివేట్ చేయకుండానే సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడడని కితాబిస్తున్నారు. Blockbuster Ama No words #Spyder — Superstar Fan (@urztrulyRaj) September 27, 2017 #SPYderDay#spyder high Octane Action and #MaheshBabu deadly charismatic presence making it even better Whole world enjoying this cinema. — Kamal Daiya (@kamaldaiya66) September 27, 2017 watched #Spyder in Sendhoorapandi my native in TN. 5am show full. sure shot blockbuster here in tamil. Mahesh fanbase here growing here big — . (@HoennForever) September 27, 2017 CINEMA is bigger than STAR ade #SPYder 👌only MB can attempt these kind of scripts 👍 2nd half (racy pace) >>> 1st half Hospital block keka — Serendipity ❤ (@PoornaPradeep4) September 27, 2017 అయితే మరికొందరు మాత్రం సినిమాపై నెగటివ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఊహించిన రేంజ్ లో లేదని, ముఖ్యంగా సెకండాఫ్ మురుగదాస్ దారుణంగా తెరకెక్కించాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ సీరియల్ కిల్లర్‌కు.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌కు మధ్య జరిగే కథను చాలా సాదాసీదాగా తీశాడంటూ పెదవి విరుస్తున్నారు. మురుగదాస్ మార్క్ మెసేజ్ అనేది లేకుండా పేలవమమైన సినిమాను అభిమానులకు అందించారని మరికొందరు చెబుతున్నారు. మరికొందరేమో సినిమాలో అరవ వాసనలు ఎక్కువయ్యాయని.. నాలుగు సీన్లు తప్ప, మిగతా కథంతా చాలా నార్మల్‌గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉన్నా రెండు సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని చెబుతున్నారు. గమనిక.. ఇది దారిన పోయే దానయ్యలు చెబుతున్న మాటలు కావు.. సినిమా చూసిన ప్రేక్షకులే చేసిన ట్వీట్లు... #SPYder @ARMurugadoss never expected..gattiga debbesav....worst narration and screenplay...totally disappointed..😢😢😢 — srikanth kampli (@srikanthkampli) September 27, 2017 Even #Thuppaki Gt Mixed Reviews on d First Day nd Later U know wht Happened. So Keep Calm nd Trust In ARM nd MB :)@MaheshFanTrends#SPYder — The Idealist™ (@vijay2297) September 27, 2017 #spyder not as bad as people are saying at the same time not very great. This is a good example of movie gone bad due to bad screenplay. — nikhil (@johnnykhil) September 27, 2017 Watching #Spyder Tamil..... #MaheshBabu has dubbed in Tamil...and its not bad actually — Priyanka (@Photos4uIndia) September 27, 2017 Muruga sir disappoint chesaramma, last ganta over d board ellipoyaru. Overall ga you may watch #Spyder for 2 to 3 episodes and performances — Hari Krishna Raju (@harikraju) September 27, 2017 If second half is even almost as good as first half, this is going to be my favourite movie of Mahesh. #SPYder — Anand (@anandvamsi) September 27, 2017 ARM to Mahesh fans #SPYder 😂 pic.twitter.com/1tCir9mZoo — Praveen Kumar (@pvn19) September 27, 2017 పూర్తి రివ్యూ కోసం చూస్తుండండి. -
సూపర్ స్టార్ ట్యాగ్ లైన్‌పై కామెంట్లు
సాక్షి, సినిమా : స్పైడర్ ఫీవర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడును షేక్ చేస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ద్విభాష చిత్రంపై అంతకంటే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో స్పైడర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మహేష్.. ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నాడు. ఈ సందర్బంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మాములుగానే ముక్కు సూటిగా సమాధానాలిచ్చే మహష్ ను ట్యాగ్ లైన్ గురించి ఓ విలేకరి ప్రశ్న అడిగారు. ఫ్యాన్స్ మిమల్ని సూపర్ స్టార్‌గా పిలుస్తుంటారు. మరి మీ దృష్టిలో అసలైన సూపర్ స్టార్ ఎవరు? అన్న ప్రశ్నకు చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. ‘భారత చలన చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లలో నాకు తెలిసి రజనీకాంత్, చిరంజీవి గార్లే నిజమైన సూపర్ స్టార్లు. చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా థియేటర్లకు జనాలను రప్పించగలిగే సామర్థ్యం వాళ్లకు మాత్రమే ఉంది. కేవలం వాళ్లను తెరపై చూసేందుకే ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఆ ట్యాగ్ లైన్ వాళ్లకే ఫర్ఫెక్ట్గా సూటవుతుంది’ అని మహేష్ బదులిచ్చారు. అయితే తన దృష్టిలో మాత్రం సినిమానే బిగ్ స్టార్ అని మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
స్పైడర్ ఆడియో ఫంక్షన్లో ఛేంజ్?
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది స్పైడర్. ఈ బైలింగువల్ చిత్రం కోసం తెలుగు, తమిళ్లో విడివిడిగా ఆడియో వేడుకలు నిర్వహించాలని ముందుగా చిత్ర నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 9న చెన్నైలో స్పైడర్ తమిళ ఆడియో వేడుకలను నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే. అదే రోజు తెలుగు ఆడియోను కూడా విడుదల చేయబోతున్నారంట. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఇద్దరు టాప్ డైరక్టర్లను చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించి, వారి చేతుల మీదుగా గ్రాండ్ గా రెండు భాషల్లో ఒకేసారి వేడుకను నిర్వహించాలనుకుంటున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల కోసం సెప్టెంబర్ 16 లేదా 17వ తేదీల్లో ట్రెండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందట. ఆడియో, ప్రీ రిలీజ్ గ్యాప్‌లో ఓ భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముచ్చటించేందుకు మహేష్ సహా స్పైడర్ టీం రెడీ అవుతోంది. తద్వారా ప్రమోషన్ పార్ట్ ను కూడా కవర్ చేసేయొచ్చన్నది మేకర్లు ఆలోచనగా చెప్పుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్-రకుల్ జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్ సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీతోపాటు అరబిక్ లో కూడా చిత్రాన్ని రిలీజ్ చేసే ఫ్లాన్లో ఉన్న విషయం తెలిసిందే. -
ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్.. స్పైడర్
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు - మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. దేశవ్యాప్తంగా ట్విట్టర్లో ఇదే టాప్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్స్ చూస్తే అందులో #Spyder మొదటి స్థానంలో ఉంది. దాంతోపాటు #Mahesh23, Mahesh Babu అనేవి కూడా ట్రెండింగులో కనిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్లో కూడా రెండు రకాల డ్రస్సుల్లో మహేష్ కనిపిస్తాడు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా మహేష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్‌లది చాలా డైనమిక్ కాంబినేషన్ అని పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ పోస్టర్‌ను రీట్వీట్ చేసింది. హాస్యనటుడు వెన్నెల కిషోర్ అయితే ఇది సూపర్ స్టార్ డే అంటూ చెప్పాడు. దర్శకుడు మలినేని గోపీచంద్ సైతం ఈ లుక్కు ఫిదా అయిపోయారు. సింప్లీ సూపర్బ్ అండ్ స్టన్నింగ్ లుక్ అని చెప్పారు. ఇంకా పలువురు సినీ విమర్శకులు, అభిమానులు సైతం మహేష్ బాబు నటిస్తున్న 23వ చిత్రం ఫస్ట్ లుక్‌ను అభినందనలతో ముంచెత్తారు. Mahesh Babu and director AR Murugadoss... Check out the TWO first look posters of this dynamic combo's #SPYder... WOW!!! pic.twitter.com/VzMv7Zdkyz — taran adarsh (@taran_adarsh) 12 April 2017 #SPYDERFirstLook motion poster


