'స్పైడర్‌లో ఆ సన్నివేశాలు తొలగించాలి'

shilam satyanarayana demands Some of Spyder scences to be remove

హైదరాబాద్‌ (రామాంతపూర్‌): ఇటీవల విడుదలైన స్పైడర్‌ చిత్రంలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆదివారం రామంతాపూర్‌లోని హిందూశ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది దళితులు ఎండక, వానకు శ్మశానంలోకష్టపడుతూ కాటికాపర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారిని ఈ చిత్రంలో కించపర్చడం తగదని ఆయన పేర్కొన్నారు.

వెంటనే సన్నివేశాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో స్థానిక కాటికాపర్ల సంఘం ప్రతినిధులు జంగయ్య, పరుశురాం, సత్యనారాయణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top