
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మహేశ్‌బాబు(Mahesh Babu), రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. SSMB29 పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే మొదలైంది. అయితే, ఈ మూవీ టైటిల్ గురించి ఒక చర్చ సోషల్‌మీడియాలో జరుగుతుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది.
SSMB29 ప్రాజెక్ట్ నుంచి మహేశ్ ప్రీలుక్ ఫోటోను దర్శకుడు రాజమౌళి(ss rajamouli) పంచుకున్నారు. అయితే, పూర్తి లుక్‌ను నవంబర్‌లో రివీల్ చేస్తామని ఆయన గతంలోనే చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం టైటిల్ గురించి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీకి 'వారణాసి'(Vaaranaasi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడిగా ఈ మూవీలో మహేశ్‌బాబు కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ టైటిల్ బాగుంటుందని కొందరు చెబుతన్నప్పటికీ మరికొందరు మాత్రం మరో పేరును ఎంపిక చేస్తే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే, ఇప్పటికే టైటిల్ ట్యాగ్‌లైన్ #Globetrotter అని జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో భాగం కానున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.