పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?
మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)
''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్‌గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.
ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.
(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)
Riddhi - Her being Part of #TheRajaSaab: 😂❤️🔥
Got Call from SKN garu: “We’re making Film with #Prabhas, we want you as Heroine.” Thought it was a prank! Called my manager to verify. They asked “Do you know Prabhas?” I said “Yes of course!” Gave look test, auditioned & Here I'm. pic.twitter.com/Latj2XAXbI— Prabhas (@HereForDarling) November 25, 2025


