పదో తరగతి విద్యార్థి అంటే స్కూల్‌కు వెళ్లామా.. తిరిగొచ్చాక కాసేపు టీవీ, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేశామా అన్నట్లు ఉంటారు. కానీ, ఈ కుర్రాడు మాత్రం సమయం ఆసన్నమైంది మిత్రమా అంటూ నేటి యువతను తట్టులేపుతున్నాడు. హైదరాబాద్‌లో ఇంకో డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందంటే బయటే కాదు.. ఇంట్లో కూడా ఉండలేమని హెచ్చరిస్తున్నాడు. ప్రభుత్వాలకే కాదు ప్రజలకు కూడా వాతావరణ మార్పులపై అధ్యయనం అత్యవసరమని ఆలోచింపజేస్తున్నాడు. ఈనెల 10–21 తేదీల్లో బ్రెజిల్‌లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్స్ ఆన్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) జరిగింది. ఈ సదస్సులో జాన్సన్ గ్రామర్ స్కూల్ నుంచి పదో తరగతి విద్యార్థి శరణ్ తేజ భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహించాడు.
వాతావరణ మ్యానిఫెస్టో..
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాప్–30 సదస్సు అంతర్జాతీయ వాతావరణ చర్య, విధానాలపై చర్చించే ప్రపంచ వేదికల్లో ఒకటి. యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్ బ్లూ జోన్ యాక్సెస్‌తో తేజను గ్లోబల్ రిప్రజెంటేటివ్‌గా ఆహా్వనించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు స్వీకరించాల్సిన శాసన సంస్కరణలు, చొరవలకు సంబంధించిన ప్రతిపాదనలను మ్యానిఫెస్టోలో తేజ పొందుపరిచారు.
‘దిస్ ఈజ్ జీరో అవర్’..
ఇకపై ఋతువులు స్థిరంగా ఉండవు. ఈ అంశాలే నన్ను స్పందించేలా చేశాయి. టీనేజర్లు, పిల్లలలో దుమ్ము, అలర్జీ, మధుమేహం, మానసిక సమస్యలు సర్వ సాధారమయ్యాయి. దీంతో నిర్మాణాత్మక వాతావరణ విద్య అత్యవసరమైంది. హైదరాబాద్ నుంచి ‘దిస్ ఈజ్ జీరో అవర్’ పేరుతో లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీఓ)ను ప్రారంభించాలని
యోచిస్తున్నారు.


