breaking news
UN Climate Change Conference
-
సమయం ఆసన్నమైంది మిత్రమా..
పదో తరగతి విద్యార్థి అంటే స్కూల్‌కు వెళ్లామా.. తిరిగొచ్చాక కాసేపు టీవీ, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేశామా అన్నట్లు ఉంటారు. కానీ, ఈ కుర్రాడు మాత్రం సమయం ఆసన్నమైంది మిత్రమా అంటూ నేటి యువతను తట్టులేపుతున్నాడు. హైదరాబాద్‌లో ఇంకో డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగిందంటే బయటే కాదు.. ఇంట్లో కూడా ఉండలేమని హెచ్చరిస్తున్నాడు. ప్రభుత్వాలకే కాదు ప్రజలకు కూడా వాతావరణ మార్పులపై అధ్యయనం అత్యవసరమని ఆలోచింపజేస్తున్నాడు. ఈనెల 10–21 తేదీల్లో బ్రెజిల్లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్స్ ఆన్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్ (యూఎన్ఎఫ్సీసీసీ) జరిగింది. ఈ సదస్సులో జాన్సన్ గ్రామర్ స్కూల్ నుంచి పదో తరగతి విద్యార్థి శరణ్ తేజ భారతదేశం నుంచి ప్రాతినిథ్యం వహించాడు. వాతావరణ మ్యానిఫెస్టో.. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాప్–30 సదస్సు అంతర్జాతీయ వాతావరణ చర్య, విధానాలపై చర్చించే ప్రపంచ వేదికల్లో ఒకటి. యునైటెడ్ నేషన్స్ క్లైమెట్ చేంజ్ కాన్ఫరెన్స్ బ్లూ జోన్ యాక్సెస్‌తో తేజను గ్లోబల్ రిప్రజెంటేటివ్‌గా ఆహా్వనించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు స్వీకరించాల్సిన శాసన సంస్కరణలు, చొరవలకు సంబంధించిన ప్రతిపాదనలను మ్యానిఫెస్టోలో తేజ పొందుపరిచారు. ‘దిస్ ఈజ్ జీరో అవర్’.. ఇకపై ఋతువులు స్థిరంగా ఉండవు. ఈ అంశాలే నన్ను స్పందించేలా చేశాయి. టీనేజర్లు, పిల్లలలో దుమ్ము, అలర్జీ, మధుమేహం, మానసిక సమస్యలు సర్వ సాధారమయ్యాయి. దీంతో నిర్మాణాత్మక వాతావరణ విద్య అత్యవసరమైంది. హైదరాబాద్ నుంచి ‘దిస్ ఈజ్ జీరో అవర్’ పేరుతో లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ (ఎన్జీఓ)ను ప్రారంభించాలని యోచిస్తున్నారు. -
‘మంచి’ వాతావరణమేది?
కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం పదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికను దాదాపు అన్ని దేశాలూ పోటీలు పడి మరీ ఉల్లంఘిస్తున్న తరుణంలో బ్రెజిల్ లోని బెలేమ్ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్–30) సదస్సు సోమవారం ప్రారంభమైంది. ప్యారిస్ ఒడంబడికలో దేశాల వాగ్దానమేమిటో, నెరవేర్చింది ఏ మేర కో చూసి లక్ష్య నిర్దేశం చేయటం కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 10 రోజుల పాటు జరుగుతుంది. కానీ విషాదమేమంటే... పెద్దగా ఫలితం లేకుండానే అవి ముగిసిపోతున్నాయి. తీసుకున్న అరకొర నిర్ణయాలైనా అమలుపరిచే నాథుడు కనబడడు. అందువల్లే నిరుడు అజర్‌బైజాన్‌లోని బాకూలో కాప్–29 తరువాత పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి సదస్సుకు అనేక విధాల ప్రాముఖ్యం ఉంది. ఇంతవరకూ ఎక్కువగా యూరప్ లేదా పశ్చిమాసియా ప్రాంత దేశాల్లో ఈ సదస్సులు నిర్వహించటం రివాజు. అందుకు భిన్నంగా దక్షిణ అమెరికా ప్రాంత దేశాన్ని ఎంపిక చేసుకోవటం ఈసారి ప్రత్యేకత. అది కూడా భూగోళానికి శ్వాసకోశాలుగా పరిగణించే అమెజాన్ అడవుల ముంగిట కొలువుదీరిన నౌకాశ్రయ నగరం బెలేమ్ కావటం గమనించదగ్గది. వాతావరణ మార్పులపై చర్చించటానికి అదైతేనే ప్రతీకాత్మక వేదికవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడి ఉండొచ్చు. అత్యంత దారిద్య్రం, వనరుల దుర్వినియోగం కొట్టొచ్చినట్టు కనబడే బెలేమ్ను దేశదేశాల నుంచీ వచ్చే ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షిస్తే సుస్థిరాభివృద్ధికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని కూడా వారు భావించి ఉండొచ్చు. ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర వాతావరణంలోకి ప్రవేశించింది. పారిశ్రామికీ కరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 డిగ్రీల సెల్సియస్ లోపే పెరుగుదల ఉండేలా... వీలైతే అది 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమయ్యేలా ప్రయత్నించాలన్నది ప్యారిస్ ఒడంబడిక కృతనిశ్చయం. కానీ 2024కే ఆ 1.5 డిగ్రీల పరిమితి దాటిపోయామని గణాంకాలు చెబుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో ఏదో అనుకోని అద్భుతం జరిగితే తప్ప ముంచుకురానున్న విపత్తును ఆపటం దుర్లభం. కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మాట తప్పడం, సాకులు చెప్పడం అన్ని దేశాలకూ అలవాటైంది.గత ఏలుబడిలో ప్యారిస్ ఒడంబడిక నుంచి బయటికొచ్చినట్టే ఇప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఇది ఒకరకంగా మేలేనని వివిధ దేశాలు భావిస్తున్నాయి గానీ, ట్రంప్ తన ‘బెదిరింపు దౌత్యం’తో మున్ముందు అందరినీ తన దారికితెచ్చే ప్రయత్నం చేస్తారు. గత నెలలో జరిగిన పరిణామమే ఇందుకు తార్కాణం. రవాణా నౌకల కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టేందుకు 100 దేశాల మధ్య అవగాహన కుదిరి, ఒడంబడికపై సంతకాలు కాబోతుండగా ట్రంప్ టీమ్ సైంధవ పాత్ర పోషించింది. సంతకాలు చేసే దేశాల నావికుల్ని అమెరికా తీరంలో అడుగు పెట్టనీయబోమని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివిధ దేశాలకు స్వయంగా ఫోన్లు చేసి బెదిరించారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఇక సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, వీసా బెదిరింపులు షరా మామూలే. దాంతో అది కాస్తా నిలిచిపోయింది. ఇప్పుడు కాప్–30కి ఆ బెడద తప్పదు.ట్రంప్ వచ్చాక అమెరికాలో హరిత ఇంధన ప్రాజెక్టులు అటకెక్కాయి. వాతావరణ మార్పు పెద్ద బోగస్ అంటూ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. వాతావరణ మార్పులపై గతంలో పెద్ద మాటలు మాట్లాడిన బిల్ గేట్స్ ప్లేటు ఫిరాయించారు. ‘మరీ అంత ప్రమాదమేమీ లేద’ంటూ నసుగుతున్నారు. యూరొప్ యూనియన్ డిటో. అక్కడ అందరిదీ తలో దోవ అవుతోంది. కర్బన ఉద్గారాల తగ్గింపులో మన దేశం రికార్డు కూడా ఏమంత మెరుగ్గా లేదు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తీరాల సమీపంలోని వేడి నీటి పగడపు దిబ్బలు కనుమరుగు కావటం ప్రమాద సంకేతమని ఇటీవలే బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చెప్పిన నేపథ్యంలో కాప్–30 చిత్తశుద్ధితో, దృఢంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటేనే భూగోళం పది కాలాలు పచ్చగా ఉండగలదు. లేనట్టయితే ఇక సరిదిద్దుకోవటం సాధ్యపడని ప్రమాదకర స్థితికి చేరుకోవటం ఖాయం. -
ఆపద పైబడుతున్నా... అదే వైఖరి
బ్రెజిల్‌లోని బెలేమ్ నగరంలో ఈ రోజు (నవంబర్ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్డేట్ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు. అయినా పెరిగిన భూతాపంవాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది. తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్‌కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి. ప్యారిస్ ఒప్పందానికి పరీక్షప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్‌లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్ 2035కల్లా 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్ సమా వేశాల్లో జరగనుంది. వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్హౌస్ వాయువు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు. అమెరికా తడబాటు – చైనా ఎడబాటుభౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు. తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఆ లోటును ఫెడరల్ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్హౌస్ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు. వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.అమందా మగ్నానివ్యాసకర్త బ్రెజిల్ పర్యావరణ పాత్రికేయురాలు -
పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ, సాక్షి: పరిశ్రమల అనుమతుల కోసం మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలకు తిరిగే బదులుగా ఉమ్మడిగా ఒకే శాఖ ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ మినిస్ట్రీ ద్వారా అనుమతులు ఇచ్చి పెట్టుబడులకు సులభతరం చేశామని తెలిపారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సుకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు భారత్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ‘‘ పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రధాన సవాళ్లు వస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీలు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అంశాలను సులభతరం చేయాలి. అనుమతులకు సంబంధించి ఒకే మంత్రిత్వ శాఖ ఉండాలి’’ అని అన్నారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు,అనుసరించాల్సిన వ్యూహాలపై ఇస్తాంబుల్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించారు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల ద్వారా సమీకరణకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిపారు. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లు చేసే దిశగా పారిశ్రామికవేత్తలను ఎంపీలు ప్రోత్సహించాలని సదస్సు లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు టార్చ్ బేరర్లుగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ల దిశగా పనిచేయాలని సదస్సు పిలునిచ్చింది. -
శిలాజ ఇంధనాలకు బైబై
దుబాయ్: హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు దుబాయ్‌లో జరుగుతున్న ‘కాప్–28’ సదస్సులో చరిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు పలికాయి. ‘శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం.. మార్పు సాధిద్దాం’ అంటూ ప్రతిన బూనాయి. కాప్–28 సదస్సులో బుధవారం చివరి సెషన్ జరిగింది. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులంతా ముక్తకంఠంలో ఆమోదించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగింది. 2050 నాటికి నెట్‌జీరో(సున్నా) ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఏడాది కాప్ సదస్సులో చెప్పుకోదగ్గ తీర్మానాలేవీ ఉండబోవన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూగోళాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉంటుందని కాప్–28 అధ్యక్షుడు సుల్తాన్ అల్–జబేర్ తేలి్చచెప్పారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని, పటిష్టమైన, నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని కాప్–28 సదస్సు పిలుపునిచ్చింది. ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని గణనీయంగా తగ్గించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని స్పష్టం చేసింది. చేతలు కావాలి: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని తగ్గించుకోవాలని గతంలో జరిగిన కాప్ సదస్సుల్లో ప్రత్యేకంగా సూచించారు. ఈసారి మాత్రం ఈ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బొగ్గుతో విద్యు త్ను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. తమ విద్యుత్ అవసరాలు తీర్చుకోవడానికి బొగ్గుపై ఆధారపడుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడానికి బుధవారం ఆమోదించిన ఒప్పందమే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళిక అని సుల్తాన్ అల్–జబేర్ అన్నారు. కాప్–28 టాప్ 10 చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1. చరిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో కాప్–28 సదస్సు ముగిసింది. ఇలాంటి కాలుష్య ఇంధనాల వాడకాన్ని క్రమంగా నిలిపివేయడానికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పెట్రోల్, డీజిల్, బొగ్గు వినియోగం అంతమయ్యే దిశగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 2. సంపన్న దేశాల నిర్వాకం వల్లే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. వాటి వల్ల పేద దేశాలు నష్టపోతున్నాయి. పేద దేశాలకు వాటిల్లుతున్న నష్టానికి గాను బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలాఏళ్లుగా ఉంది. ఈ సదస్సులో దానికి కార్యరూపం వచి్చంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 3. నిర్దేశిత గడువు కంటే నెట్జిరో కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని కెనడా, బెల్జియం వంటి దేశాలు ప్రకటించాయి. 2030 నాటికి ఉద్గారాలను 50 శాతం తగ్గించుకుంటామని దుబాయ్ వెల్లడించింది. 4. 2030 కంటే ముందే గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడానికి శుద్ధ ఇంధనాల వనరుల వాడకాన్ని గణనీయంగా పెంచుకోవాలని నిర్దేశించారు. 5. క్లైమేట్ యాక్షన్ కోసం సంపన్న దేశాల నుంచి నిధులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. 6. జీవ వైవిధ్యానికి, మానవళికి ఎలాంటి హాని కలగకుండా వాతావరణ మార్పుల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని నిర్దేశించారు. 7. ప్రస్తుతం అమల్లో ఉన్న పారిస్ ఒప్పందం లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగం, ఉత్పత్తిని తగ్గించుకోవాలని ఆదేశించారు. 8. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ ఫండ్ తరహాలో క్లైమేట్ ఫైనాన్స్, సపోరి్టంగ్ ఫండ్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు కొన్నిదేశాలు, సంస్థలు మద్దతు ప్రకటించాయి. 9. కాప్–26 సదస్సు ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కర్బన్ ఉద్గారాల సమాచారాన్ని నమోదు చేసే విషయంలో నిబంధనలు సవరించారు. 10. అన్ని దేశాల, అన్ని వర్గాల అవసరా లను దృష్టిలో పెట్టుకొని శిలాజ ఇంధనాల నుంచి ఇతర ప్రమాద రహిత ఇంధనాల వైపు క్రమానుగతంగా మారాలని సూచించారు. -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్‌పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు! -
గత 7 ఏళ్లలో భారీగా పెరిగిన సౌరశక్తి సామర్థ్యం
గత 7 ఏళ్లలో 17 రేట్లు పెరిగిన తర్వాత భారతదేశ సౌరశక్తి సామర్థ్యం సుమారు 45 గిగావాట్లకు చేరుకుందని నేడు జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో ఇండియా తెలిపింది. ప్రపంచ జనాభాలో 17 శాతం జనాభా కలిగిన దేశం, కాలుష్య ఉద్గారాల పరంగా 4 శాతం మాత్రమే అని నొక్కి చెప్పింది. సీఓపీ26 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో 11వ ఫెసిలిటేటివ్ షేరింగ్ ఆఫ్ వ్యూస్(ఎఫ్ఎస్ వి) సందర్భంగా తన మూడవ ద్వైవార్షిక నవీకరణ నివేదిక(బియుఆర్)పై ప్రజంటేషన్ ఇస్తూ భారతదేశం ఇలా చెప్పింది. ప్రస్తుత వార్షిక గ్రీన్ హౌస్ వాయువు(జీహెచ్ జీ) ఉద్గారాలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గత ఏడేళ్లలో భారత దేశం ఏర్పాటు చేసిన సౌరశక్తి సామర్థ్యాన్ని 17 రెట్లు పెంచామని, సౌరశక్తి సామర్థ్యాన్ని ఇప్పుడు 45 గిగావాట్లకు చేరుకున్నట్లు అని భట్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. "2015 - 2019 మధ్య, అడవి విస్తీర్ణం 13,031 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఆసియా సింహం, ఏనుగు, ఖడ్గమృగాల సంఖ్య గత 5 నుంచి 6 సంవత్సరాలలో అనేక రెట్లు పెరిగింది" అని భారతదేశం ప్రకటనలో తెలిపింది. (చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు) -
‘అబ్బా.. ఏం ఉక్కపోత’.. ఇదో వరల్డ్ రికార్డ్ మరి!
మబ్బు పట్టిన వాతావరణం ఉన్నా.. అధిక వేడి, ఉక్కపోతతో ‘ఇది అసలు వానాకాలమేనా?’ అనే అనుమానం చాలామందికి కలిగించింది జులై నెల. ఇక ఆగస్టు లోనూ ఇదే తీరు కొనసాగుతున్నా.. అక్కడక్కడ చిరు జల్లులు- ఓ మోస్తరు వానలు, ఎక్కడో దగ్గర భారీ వర్షాలు.. తప్పించి పెద్దగా సీజన్ ప్రభావం కనిపించడం లేదు. దీంతో ఈసారి ఆగష్టు నాటికే అధిక వర్షాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయన్న భారత వాతావరణ శాఖ జోస్యం తప్పినట్లే అయ్యింది!!. ఇక ఈ భూమ్మీద ఇప్పుటిదాకా నమోదుకానీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈసారే నమోదు అయ్యాయి మరి!. యూఎస్ నేషనల్ ఓషనిక్ అండ్ ఎట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), యూరోపియన్ కాపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీసెస్, యూఎన్ క్లైమేట్ సైన్స్ రిపోర్ట్.. ఈ మూడూ కూడా స్వల్ఫ తేడాలతో జులై నెలను ‘హాటెస్ట్ మంత్’గా ప్రకటించాయి. గత వంద సంవత్సరాల్లో ఈ సీజన్లో ఈ జులైను ఉక్కపోత నెలగా అభివర్ణించాయి. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ఈ సీజన్ సమ్మర్.. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాకాల సీజన్ కొనసాగుతుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా వర్షాభావ ప్రాంతాల్లోనూ వాతావరణం ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తోంది. వేడి ప్రభావంతో శీతల గాలుల ప్రభావమూ తగ్గడం ఈసారి విశేషం. చదవండి: కలిసి కదిలితేనే భూరక్ష ‘‘ఇదో కొత్త రికార్డు. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు, కార్చిచ్చు ప్రమాదాలు.. మరోవైపు కుంభవృష్టితో వరదలు, భూతాపం-వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అని ఎన్ఓఏఏ ప్రతినిధి స్పినార్డ్ వెల్లడించాడు. 142 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఈసారి రికార్డును లెక్కగట్టారు. సముద్ర ఉపరితల వాతావరణంపై 0.93 సెంటీగ్రేడ్ పెరుగుదల వల్ల 50 డిగ్రీల సెల్సియస్ కన్నా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈసారి జూన్ చివర్లోనూ చాలా దేశాల్లో(ఉదాహరణకు పాకిస్థాన్) నమోదు అయ్యాయని ఆయన వివరించాడు. భూతాపోన్నతిని తగ్గించే చర్యలు తక్షణం చేపట్టకపోతే 2040 కల్లా సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడం తథ్యమని ఇప్పటికే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్‌క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) హెచ్చరికలు జారీ చేసింది కూడా. పర్యావరణ సంరక్షణను ప్రభుత్వాలు, సంబంధిత ఆర్గనైజేషన్లే నిర్వర్తించాలన్న రూల్ ఏం లేదు. సాధారణ పౌరులుగా బాధ్యతతో వ్యవహరిస్తే.. వాతావరణ ప్రతికూల మార్పులను కొంతలో కొంత తగ్గించవచ్చనేది పర్యావరణ నిపుణుల మాట. ►ఆహార వృథాను అరికట్టడం ►కొంచెం కష్టంగా అనిపించినా.. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని నెమ్మదిగా తగ్గించడం. ►అవసరమైతే ఇంధన వనరుల విషయంలో ప్రత్యామ్నాయాలకు జై కొట్టడం ►ఎనర్జీ(ఇంట్లో కరెంట్) పొదుపుగా వాడడం ►చెట్ల సంరక్షణ.. మొక్కల పెంపకం -
‘క్లై ఫై’తో ప్రళయమా ?
న్యూఢిల్లీ: క్లైమేట్ ఛేంజ్...భూతాపోన్నతి పెరిగి ప్రపంచంలో సంభవించే పెను మార్పులు. నేటి ‘వైఫై’ యుగంలో క్లైమేట్ ఛేంజ్‌ను ‘క్లైఫై’ అని పిలుస్తున్నారు. తైవాన్‌లోని బ్లాగర్ డాన్ బ్లూమ్ 2007లో ఈ పదాన్ని కాయిన్ చేశారు. ఇది 2013 నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. బ్లాగ్లు, వార్తా పత్రికలు, నవలల్లో ఎప్పటి నుంచో భూతాపోన్నతి పెరగడం పట్ల చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఫిక్షన్ కథలు వెలువడుతున్నాయి. ఇదే అంశంపై దేశ, దేశాధినేతలు కూడా సుదీర్ఘకాలంగా సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో పేర్కొన్న వరదలు కూడా భూతాపోన్నతి కారణంగానే అన్న సూత్రీకరణల కాలం నుంచే చర్చలు కొనసాగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. రియోలో 1992లో ప్రపంచ దేశాల మధ్య భూతాపోన్నతి తగ్గించేందుకు ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దానిలో ఏ అంశం కూడా నేడు అమలు కావడం లేదు. అందుకే సోమవారం పారిస్‌లో ప్రారంభమైన సదస్సు ప్రధానంగా నాటి ఒప్పందాన్నే సమీక్షిస్తోంది. ఇంతకు ‘క్లై ఫై’ అంటే ఏమిటి? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని అడ్డుకోవడం ఎట్లా? నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యుల వరకు ఎక్కువ మందికి అంతు చిక్కని ప్రశ్నే! పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కార్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరుగుతోందని, ఫలితంగా రుతుక్రమాలు గతి తప్పుతాయని, ఒక ప్రాంతంలో వర్షాలు అధికంగా పడి వరదలు సంభవిస్తే, మరో ప్రాంతంలో వర్షపు చినుకు కూడా పడకుండా దుర్భర కరువు పరిస్థితులు దాపురిస్తాయని, భూతాపోన్నతి కారణంగా ధ్రువాల్లో మంచు కొండలు కరిగిపోయి జల ప్రళయం వస్తుందని, భూపొరల్లో మార్పులు వచ్చి అగ్ని పర్వతాలు బద్ధలై ప్రళయ భీకరాన్నిసృష్టిస్తాయని, సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోతే ఏదో ఒకరోజు భూగోళంపై సమస్త జీవరాశి నశిస్తుందని స్థూలంగా సామాన్యులకున్న అవగాహన. అందుకనే భూతాపోన్నతి పరిణామాలపై ఎన్నో హాలివుడ్ సినిమాలు, దాదాపు 150 నవలలు వచ్చాయి. 1976లో ‘హీట్’ అనే నవలను ఆర్థర్ హెర్జోగా రాశారు. ‘ది సన్ అండ్ ది సమ్మర్’ అనే నవలను జార్జ్ టర్నర్ 1987లో రాశారు. మ్యాగీ గీ, టీసీ బోయల్, అట్వూడ్, మైఖేల్ క్రిక్టాన్, బార్బర కింగ్సాల్వర్, ఐయాన్ మ్యాక్‌ఎవాన్, కిమ్ స్టాన్లే రాబిన్సన్, ఐజా త్రోజనోవ్, జీనెట్ వింటర్సన్ లాంటి రచియతలతోపాటు వర్ధమాన రచయితలు స్టీవెన్ ఆమ్స్టర్డామ్, ఎడన్ లెపుకీ, జాన్ రాసన్, నిథానియల్ రిచ్ లాంటి వారు పలు రచనలు చేశారు. వీరి రచనల కారణంగానైతేనేమీ, హాలివుడ్ సినిమాలు, పత్రికలు, ఇతర మీడియా మాధ్యమాల వల్లనైతేనేమీ భూతాపోన్నతిపై చర్చలు జరుగుతున్నా అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్య సయోధ్య కుదరక భూతాపోన్నతి అరికట్టే చర్యలు ముందుకు సాగడం లేదు. అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలే కర్బన ఉద్గారాలకు ఎక్కువ కారణమవుతున్నాయని, వాటితో సమానంగా చర్యల ప్రమాణాలను తమకు సూచిస్తే ఎట్లా ? అని వర్ధమాన దేశాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్లనే భూతాపోన్నతి పెరగడం లేదు. అడవుల విస్తరణ తరిగి పోవడం, ఖనిజ సంపద కోసం గనుల తవ్వకాలు జరపడం, రాళ్లు, కంకర కోసం పర్వతాలను మట్టి కరిపించడం, నదీ జలాల ప్రవాహాన్ని భారీ డ్యామ్‌లతో అరికట్టడం, వాటిని ప్రకృతికి విరుద్ధంగా తరలించడం కూడా ప్రధాన కారణాలే.


