పక్కా ప్లానింగ్‌..! ఇయర్‌ ఎండ్‌ వేడుకలకు ట్రావెల్స్‌ సందడి.. | Travel BuzzFor year-end celebrations, travel buzz includes vibrant parties | Sakshi
Sakshi News home page

పక్కా ప్లానింగ్‌..! ఇయర్‌ ఎండ్‌ వేడుకలకు ట్రావెల్స్‌ సందడి..

Nov 26 2025 1:48 PM | Updated on Nov 26 2025 3:51 PM

Travel BuzzFor year-end celebrations, travel buzz includes vibrant parties

సంవత్సరాంతం వేడుకలకు హైదరాబాద్‌ నగర వాసుల్లో ఉండే ఉత్సాహం వేరు. ఇక్కడి సెలబ్రేషన్‌ కల్చర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కల్చర్‌ ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. సంవత్సరాంతం వేడుకలు భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. టెక్‌ హబ్, కల్చర్‌ హబ్, పార్టీ హబ్‌.. ఇలా అన్ని రంగాల ఉద్యోగుల్లోనూ ఇయర్‌ ఎండ్‌ మూడ్‌ నిండిపోయింది. దీంతో ముందుగానే ప్లానింగ్, బుకింగ్స్‌ పనిలోపడ్డారు పలువురు ఔత్సాహికులు. 

నవంబర్‌ చివరి వారం కావడంతో ఎవరికి వారు తమ ట్రావెల్‌ డెస్టినేషన్స్‌పై ఆలోచనలో పడ్డారు. ఇంకొందరైతే ఏకంగా బుకింగ్స్‌ పూర్తి చేసేశారని, గతేడాదితో పోల్చితే ఈ యేడాడి ఇప్పటికే బుకింగ్స్‌ జోరందుకున్నాయని పలు ట్రావెల్‌ సంస్థలు చెబుతున్నాయి. దీంతో పాటు ఔట్‌డోర్‌ ఈవెంట్స్‌కి సంబంధించిన పాసెస్‌ బుకింగ్‌ పనిలోనూ నగరవాసులు బిజీ అయ్యారు

ఓ వైపు నవంబర్‌ నెల ముగుస్తోంది.. మరోవైపు క్రిస్మస్‌–న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం భారీగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇయర్‌ ఎండ్‌ ప్లాన్‌ ఈ సారి ముందుగానే ప్రారంభమైనట్లు సందడి కనిపిస్తోంది. గతేడాది చివరి నిమిషంలో బుకింగ్స్‌ లేక నిరుత్సాహపడిన కొందరు ఈ సారి ముందుగా జాగ్రత్తపడుతున్నారు. 

దీంతో నవంబర్‌ చివరి వారంలోనే రిసార్టులు, లైవ్‌ ఈవెంట్స్, ఇంటర్‌ స్టేట్‌ టూర్స్, ఫ్లైట్‌ బుకింగ్స్‌ చేసుకోవడంలో హైదరాబాదీలు ఆసక్తి చూపుతున్నారు. పలు బుకింగ్‌ సంస్థలు ఇప్పటికే ఆఫర్లు, ప్లానింగ్స్‌కు సంబంధించిన టారీఫులను విడుదల చేశాయి. నవంబర్‌ చివరి వారంలోనే హైదరాబాద్‌లో ఇయర్‌ ఎండ్‌ కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయ్యిందా అన్నట్లు సందడి కనిపిస్తోంది. 

ఈ ఏడాది కూడా హిట్‌.. 
సిటీలో కాకుండా బయటి ప్రదేశాల్లో సెలబ్రేట్‌ చేయాలనే ట్రెండ్‌ ఈసారి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గోవా, వైజాగ్, పుదుచ్చేరి, ఊటీ, కేరళ వంటి డెస్టినేషన్లకు డిసెంబర్‌ 25 నుంచి 31 మధ్య భారీ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో హైదరాబాదీలు ఇప్పటి నుంచే ఫ్లైట్, ట్రైన్, హోటల్‌ బుకింగ్‌లు పూర్తి చేసుకుంటున్నారు. 

గోవా–హైదరాబాద్‌ ఫ్లైట్స్‌ ధరలు డిసెంబర్‌ రెండో వారంలో పెరిగే అవకాశం ఉండటంతో హడావుడి మొదలైందని ట్రావెల్‌ ఏజెంట్లు చెబుతున్నారు. యంగ్‌ ట్రావెలర్స్‌ లద్దాక్, హంపి, ఆంధ్ర–ఒడిశా, కోస్తా ప్రాంతాల్లో రోడ్‌ట్రిప్పులు కూడా ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ చివరి వారంలో క్యాబ్‌లు, డ్రైవర్‌–ఆన్‌–హైర్‌ సరీ్వసులకు డిమాండ్‌ భారీగా ఉండే సూచనలు ఉన్నాయి.

ముందస్తు బుకింగ్స్‌.. 
ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం నవంబర్‌ చివరి వారం ఇయర్‌ ఎండ్‌ ప్లాన్లకు అత్యంత ముఖ్యమైనది. డిసెంబర్‌ 10 తర్వాత రిసార్ట్స్, ఫ్లైట్స్, ఈవెంట్‌ టికెట్ల ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. 

లేటుగా ప్లాన్‌ చేసే వారికి ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డులు కన్ఫర్మ్‌. గ్రూప్‌ ట్రిప్స్, కార్పొరేట్‌ ఈవెంట్స్, ఫ్యామిలీ స్టెకేషన్స్‌ వంటి వాటికి అడ్వాన్స్‌ బుకింగ్‌ ఏకైక అవకాశం. దీంతో ఈ వారం హాలీవుడ్‌ మూవీ ఫ్రీ–సేల్‌ సెషన్‌లా బుకింగ్‌లు జరిగిపోతున్నాయని ట్రావెల్, ఈవెంట్‌ రంగాల నిపుణులు చెబుతున్నారు. 

రిసార్ట్స్, ఫార్మ్‌ హౌస్‌లకు డిమాండ్‌.. 

శంషాబాద్, ముచ్చింతల్, గండిపేట్, కోకాపేట్‌ పరిసర ప్రాంతాల్లోని లగ్జరీ రిసార్ట్స్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 రాత్రి కోసం 60–70% వరకు 

ముందుగానే బుక్‌ అయ్యాయి. స్టెకేషన్, ఫ్యామిలీ ప్యాకేజీలు, కపుల్స్‌ కోసం ప్రత్యేక న్యూ ఇయర్‌ డిన్నర్‌ ఈవెంట్స్‌.. ఇలా అన్నింటికీ డిమాండ్‌ పెరిగిందని రిసార్ట్‌ మేనేజ్‌మెంట్‌లు చెబుతున్నాయి. గతేడాది చివరి వారంలో పలువురు ఔత్సాహికులకు ఎదురైన ‘నో రూమ్‌’ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే రూములు బ్లాక్‌ చేసుకుంటున్నారు. 

పబ్బులు, నైట్‌క్లబ్బుల పాస్‌ అమ్మకాలు.. 
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పరిసరాల్లో జరిగే డీజే నైట్స్, లైవ్‌ బ్యాండ్‌ షోలకు డిసెంబర్‌ మొదటి వారం నుంచే ఎర్లీ బర్డ్‌ పాసెస్‌ అమ్ముడుపోతున్నాయి. ప్రముఖ క్లబ్‌లలో జరిగే న్యూ ఇయర్‌ వేడుకలకు మొదటి దశలోనే పాస్‌లు 50% వరకూ సేల్‌ అవ్వడం గమనార్హం. సోషల్‌ మీడియాలో న్యూ ఇయర్‌ నైట్‌ సెలబ్రేట్‌ చేయడం యువతలో ఒక లైఫ్‌ స్టైల్‌ ట్రెండ్‌గా మారడం వల్ల ఈ డిమాండ్‌ మరింత పెరిగినట్లు ఈవెంట్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

షాపింగ్‌ మూడ్‌లో సిటీ.. 
సెలబ్రేషన్‌ స్టేషన్‌కు వెళ్ళే ముందు లుక్‌ మిస్‌ అవ్వకూడదనే భావనతో మాల్స్, డిజైనర్‌ స్టోర్లలో యువత షాపింగ్‌ రద్దీ పెరుగనుంది. న్యూ ఇయర్‌ పార్టీ వేర్, ట్రావెల్‌ వేర్, గిఫ్టింగ్‌ ఐటమ్‌ల కోసం ఇప్పటికే సీజనల్‌ కాస్ట్యూమ్‌ నగరానికి చేరుకుంది. డిసెంబర్‌ మూడో వారానికి హైదరాబాద్‌ మాల్స్‌ పూర్తిగా పండుగ వాతావరణంలోకి వెళ్లే అవకాశముందని రిటైల్‌ అసోసియేషన్లు చెబుతున్నాయి.  

( చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement