breaking news
Travel bookings
-
పక్కా ప్లానింగ్..! ఇయర్ ఎండ్ వేడుకలకు ట్రావెల్స్ సందడి..
సంవత్సరాంతం వేడుకలకు హైదరాబాద్ నగర వాసుల్లో ఉండే ఉత్సాహం వేరు. ఇక్కడి సెలబ్రేషన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కల్చర్ ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. సంవత్సరాంతం వేడుకలు భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. టెక్ హబ్, కల్చర్ హబ్, పార్టీ హబ్.. ఇలా అన్ని రంగాల ఉద్యోగుల్లోనూ ఇయర్ ఎండ్ మూడ్ నిండిపోయింది. దీంతో ముందుగానే ప్లానింగ్, బుకింగ్స్ పనిలోపడ్డారు పలువురు ఔత్సాహికులు. నవంబర్ చివరి వారం కావడంతో ఎవరికి వారు తమ ట్రావెల్ డెస్టినేషన్స్‌పై ఆలోచనలో పడ్డారు. ఇంకొందరైతే ఏకంగా బుకింగ్స్ పూర్తి చేసేశారని, గతేడాదితో పోల్చితే ఈ యేడాడి ఇప్పటికే బుకింగ్స్ జోరందుకున్నాయని పలు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. దీంతో పాటు ఔట్‌డోర్ ఈవెంట్స్‌కి సంబంధించిన పాసెస్ బుకింగ్ పనిలోనూ నగరవాసులు బిజీ అయ్యారు. ఓ వైపు నవంబర్ నెల ముగుస్తోంది.. మరోవైపు క్రిస్మస్–న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భారీగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ ప్లాన్ ఈ సారి ముందుగానే ప్రారంభమైనట్లు సందడి కనిపిస్తోంది. గతేడాది చివరి నిమిషంలో బుకింగ్స్ లేక నిరుత్సాహపడిన కొందరు ఈ సారి ముందుగా జాగ్రత్తపడుతున్నారు. దీంతో నవంబర్ చివరి వారంలోనే రిసార్టులు, లైవ్ ఈవెంట్స్, ఇంటర్ స్టేట్ టూర్స్, ఫ్లైట్ బుకింగ్స్ చేసుకోవడంలో హైదరాబాదీలు ఆసక్తి చూపుతున్నారు. పలు బుకింగ్ సంస్థలు ఇప్పటికే ఆఫర్లు, ప్లానింగ్స్కు సంబంధించిన టారీఫులను విడుదల చేశాయి. నవంబర్ చివరి వారంలోనే హైదరాబాద్‌లో ఇయర్ ఎండ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందా అన్నట్లు సందడి కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా హిట్.. సిటీలో కాకుండా బయటి ప్రదేశాల్లో సెలబ్రేట్ చేయాలనే ట్రెండ్ ఈసారి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గోవా, వైజాగ్, పుదుచ్చేరి, ఊటీ, కేరళ వంటి డెస్టినేషన్లకు డిసెంబర్ 25 నుంచి 31 మధ్య భారీ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో హైదరాబాదీలు ఇప్పటి నుంచే ఫ్లైట్, ట్రైన్, హోటల్ బుకింగ్‌లు పూర్తి చేసుకుంటున్నారు. గోవా–హైదరాబాద్ ఫ్లైట్స్ ధరలు డిసెంబర్ రెండో వారంలో పెరిగే అవకాశం ఉండటంతో హడావుడి మొదలైందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. యంగ్ ట్రావెలర్స్ లద్దాక్, హంపి, ఆంధ్ర–ఒడిశా, కోస్తా ప్రాంతాల్లో రోడ్ట్రిప్పులు కూడా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో క్యాబ్‌లు, డ్రైవర్–ఆన్–హైర్ సరీ్వసులకు డిమాండ్ భారీగా ఉండే సూచనలు ఉన్నాయి.ముందస్తు బుకింగ్స్.. ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం నవంబర్ చివరి వారం ఇయర్ ఎండ్ ప్లాన్లకు అత్యంత ముఖ్యమైనది. డిసెంబర్ 10 తర్వాత రిసార్ట్స్, ఫ్లైట్స్, ఈవెంట్ టికెట్ల ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. లేటుగా ప్లాన్ చేసే వారికి ‘సోల్డ్ అవుట్’ బోర్డులు కన్ఫర్మ్. గ్రూప్ ట్రిప్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఫ్యామిలీ స్టెకేషన్స్ వంటి వాటికి అడ్వాన్స్ బుకింగ్ ఏకైక అవకాశం. దీంతో ఈ వారం హాలీవుడ్ మూవీ ఫ్రీ–సేల్ సెషన్‌లా బుకింగ్‌లు జరిగిపోతున్నాయని ట్రావెల్, ఈవెంట్ రంగాల నిపుణులు చెబుతున్నారు. రిసార్ట్స్, ఫార్మ్ హౌస్‌లకు డిమాండ్.. శంషాబాద్, ముచ్చింతల్, గండిపేట్, కోకాపేట్ పరిసర ప్రాంతాల్లోని లగ్జరీ రిసార్ట్స్ ఈ ఏడాది డిసెంబర్ 31 రాత్రి కోసం 60–70% వరకు ముందుగానే బుక్ అయ్యాయి. స్టెకేషన్, ఫ్యామిలీ ప్యాకేజీలు, కపుల్స్ కోసం ప్రత్యేక న్యూ ఇయర్ డిన్నర్ ఈవెంట్స్.. ఇలా అన్నింటికీ డిమాండ్ పెరిగిందని రిసార్ట్ మేనేజ్మెంట్లు చెబుతున్నాయి. గతేడాది చివరి వారంలో పలువురు ఔత్సాహికులకు ఎదురైన ‘నో రూమ్’ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే రూములు బ్లాక్ చేసుకుంటున్నారు. పబ్బులు, నైట్‌క్లబ్బుల పాస్ అమ్మకాలు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పరిసరాల్లో జరిగే డీజే నైట్స్, లైవ్ బ్యాండ్ షోలకు డిసెంబర్ మొదటి వారం నుంచే ఎర్లీ బర్డ్ పాసెస్ అమ్ముడుపోతున్నాయి. ప్రముఖ క్లబ్‌లలో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు మొదటి దశలోనే పాస్‌లు 50% వరకూ సేల్ అవ్వడం గమనార్హం. సోషల్ మీడియాలో న్యూ ఇయర్ నైట్ సెలబ్రేట్ చేయడం యువతలో ఒక లైఫ్ స్టైల్ ట్రెండ్‌గా మారడం వల్ల ఈ డిమాండ్ మరింత పెరిగినట్లు ఈవెంట్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షాపింగ్ మూడ్‌లో సిటీ.. సెలబ్రేషన్ స్టేషన్‌కు వెళ్ళే ముందు లుక్ మిస్ అవ్వకూడదనే భావనతో మాల్స్, డిజైనర్ స్టోర్లలో యువత షాపింగ్ రద్దీ పెరుగనుంది. న్యూ ఇయర్ పార్టీ వేర్, ట్రావెల్ వేర్, గిఫ్టింగ్ ఐటమ్‌ల కోసం ఇప్పటికే సీజనల్ కాస్ట్యూమ్ నగరానికి చేరుకుంది. డిసెంబర్ మూడో వారానికి హైదరాబాద్ మాల్స్ పూర్తిగా పండుగ వాతావరణంలోకి వెళ్లే అవకాశముందని రిటైల్ అసోసియేషన్లు చెబుతున్నాయి. ( చదవండి: -
‘దీపావళి’ పర్యాటక కళ!
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్‌లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్‌లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్లో ప్రయాణాలకు కీలక డిమాండ్‌గా ఉన్నట్టు మేక్‌మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు. ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్‌లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంకు బుకింగ్‌లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం. ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్‌లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్‌కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. వారణాసికి డిమాండ్.. దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్‌తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్‌లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్‌పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్‌లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్‌లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్‌కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్‌లు వస్తున్నట్టు క్లియర్‌ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్‌లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. -
అదానీ వన్‌తో మొబిక్విక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు. -
మెట్రోలు, హిల్ స్టేషన్లకే మొగ్గు
ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ‘బుకింగ్ డాట్ కామ్’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్లు, గెస్ట్ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎక్కువగా.. మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు. 86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్ డాట్ కామ్ కంట్రీ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. -
ప్రయాణం.. అప్పటికప్పుడే!
చివరి నిమిషంలో ప్రయాణానికే హైదరాబాదీల మొగ్గు ⇒ 40% ట్రావెల్ బుకింగ్స్ ఆఖర్లో జరుగుతున్నవే ⇒ ఇందులో 54 శాతం వాటా మొబైల్స్ నుంచే ⇒ క్లియర్‌ట్రిప్ సక్సెస్‌కు కారణమిదే ⇒ క్లియర్‌ట్రిప్ సీఎంఓ సుబ్రహ్మణ్య శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అనుకున్నదే తడవు’’ అనే నానుడిని భాగ్యనగరవాసులు పక్కా ఫాలో అవుతున్నారు. అందుకేనేమో ముందస్తు ట్రావెల్ బుకింగ్స్ కంటే చివరి నిమిషంలో చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయట. మొత్తం వ్యాపారంలో ఇలా జరుగుతున్నది ఏకంగా 40 శాతానికి చేరిందంటున్నారు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి (సీఎంఓ) సుబ్రహ్మణ్య శర్మ. ఈ 40 శాతంలో కూడా 54 శాతం బుకింగ్స్ సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్నవేనని తెలియజేశారు. ‘దక్షిణ భారతదేశం- ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమ’ అనే అంశంపై మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... ⇒ దేశంలో ఆన్లైన్ ట్రావెల్ విభాగం ఏటా 32% వృద్ధిని కనబరుస్తోంది. 19.8ుతో దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలవగా.. 18.2%తో బ్రెజిల్, 14.1%తో చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. ⇒ ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది క్లియర్‌ట్రిప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 5 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు కూడా. నెలకు 6.5 లక్షల మంది కస్టమర్లు క్లియర్‌ట్రిప్ సేవల్ని స్మార్ట్ఫోన్లు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వినియోగించుకుంటున్నారు. ఇందులో మొబైల్స్ ద్వారా జరుగుతున్న వినియోగం నెలకు 3 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. ఏటా 30 లక్షల ట్రావెల్ బుకింగ్స్ జరుగుతుంటే.. ఇందులో 70% మంది రిపీటెడ్ కస్టమర్లే. ⇒ ఆన్లైన్ ట్రావెల్స్ బుకింగ్స్‌లో మొబైల్ ఫోన్లదే అగ్రస్థానం. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కొందరికే పరిమితం కనక సెల్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అందుకే 2006లో ప్రారంభమైన క్లియర్‌ట్రిప్ సంస్థ.. 2010లో మొబైల్ వెబ్‌సైట్‌ను, 2012లో ఐఓఎస్ యాప్‌ను, 2014లో ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమలో మేక్మైట్రిప్ మొదటి స్థానంలో ఉంటే.. మొబైల్ ఫోన్ల ద్వారా ట్రావెల్ బుకింగ్స్‌ను వినియోగించటంలో క్లియర్‌ట్రిప్ మొదటి స్థానంలో ఉంది. ⇒ గతేడాది మా టర్నోవర్ 8 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో 43-44 శాతం వాటా మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చిందే. భవిష్యత్తులో మా పెట్టుబడుల్లో 60 శాతం వాటాను మొబైల్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ మీదే పెట్టాలని నిర్ణయించాం. ⇒ క్లియర్‌ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్స్ విభాగంలో హైదరాబాద్ వాటా 6 శాతం. ఏటా దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా విమానయాన బుకింగ్స్ 150-160 శాతం వృద్ధి రేటును కనబరుస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 192 శాతం వృద్ధి రేటుంది. హోటల్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 903 శాతం వృద్ధి ఉంది. ⇒ విమాన టికెట్లకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా 28 శాతం బుకింగ్స్ ఆఖరి నిమిషంలో అవుతుంటే.. డెస్క్‌టాప్‌ల ద్వారా 18 శాతం చేస్తున్నారు. రెండు రోజుల ముందైతే మొబైల్స్ ద్వారా 72 శాతం మంది చేస్తుంటే.. డెస్క్‌టాప్ ద్వారా 82 శాతం మంది చేస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీకే మా మద్దతు మూడు నెలలక్రితం కొన్ని టెలికం కంపెనీలతో భాగస్వాములమై మా అప్లికేషన్‌ను ఉచితంగా ఇచ్చాం. అయితే తర్వాతి రోజే ‘‘క్రియర్ట్రిప్ను డౌన్లోడ్ చేసుకోవటం మానేస్తున్నాం. ఎందుకంటే నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా మేం పోరాడుతున్నాం’’ అని కొందరు కస్టమర్లు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే నెట్ న్యూట్రాలిటీకి మేమూ మద్దతు ప్రకటించాం. వారి భాగస్వామ్యం నుంచి వైదొలిగాం. కస్టమర్లు, వారి అభిరుచులు, గౌరవాలే మాకు ముఖ్యం. కొన్ని సంస్థల ప్రయోజనాల కోసం కస్టమర్లను కోల్పోలేం.


