పెంపుడు కుక్కలు యజమాని మీద ఆగ్రహం చూపించడం, ఒక్కోసారి ప్రాణాలను తీయడంచాలా అరుదుగా జరిగే విషాదం. అమెరికాలో కుక్కల కేర్ టేకర్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, కుక్కల చేతిలో దారుణంగా చనిపోయింది. మూడు పిట్ బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు విడిచింది.
టెక్సాస్‌లోని టైలర్‌లోని ఉండే కుటుంబం మూడు పెట్ డాగ్స్ పిట్ బుల్స్ పెంచుకుంటోంది. టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మాడిసన్ రిలే హల్‌కు కూడా ఇవంటే చాలా ప్రేమ. అవి కూడా ప్రేమగానే ఉండేవి. నవంబర్ 21న సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో హల్ ఇంటి వెనుక వెనుక దాడిచేయడంతో విగతజీవిగా కనిపించింది.
హల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఇటీవల కుక్కల యజమాని ఇంట్లో కుటుంబ పిల్లలను చూసుకునేంది. అలాగే కుక్కలను కూడా చూసుకునేందుకు అంగీకరించింది. ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు పట్టణంలో లేనప్పుడు ఆమెపై దాడి చేశాయి. ఆ శబ్దం విన్న పొరుగువాళలు, అత్యవసర సేవలకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న అక్కడకు వచ్చిన అధికారిపైనా దాడికి యత్నించడంతో పిట్ బుల్స్‌లో ఒకదానిని కాల్చి చంపాడు. మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గాయాలతో కొద్దిసేపటికే మరణించింది. హల్ తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆమె పట్ల ప్రేమగా ఉన్న కుక్కలలో ఇటీవల వచ్చిన మార్పు గురించి ప్రస్తావించిందని గుర్తు చేసుకున్నారు.


