పాకిస్థాన్‌లో హిందూ రైతు దారుణహత్య | Hindu farmer was brutally murdered in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో హిందూ రైతు దారుణహత్య

Jan 10 2026 1:16 PM | Updated on Jan 10 2026 3:52 PM

 Hindu farmer was brutally murdered in Pakistan

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న ఓ హిందు రైతుని సర్ఫరాజ్‌ నిజామని అనే భూస్వామి కాల్చిచంపారు. దీంతో అక్కడి మైనార్టీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. భారత్‌లోమైనార్టీల హక్కులు కాలరాస్తున్నారని అక్కడి విదేశాంగశాఖ మంత్రి ప్రసంగించిన మరుసటి రోజే అక్కడి ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. 

ఇటీవల కాలంలో ఇస్లామిక్ అధిపత్యం ఉన్న దేశాలలో హిందువులపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై తీవ్రస్థాయిలో హింస చేలరేగింది. అక్కడి స్టూడెంట్ లీడర్ మృతితో అక్కడి మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. ఇస్లాం వ్యతిరేక ప్రచారాల నెపం మోపి అనేక మందిపై దాడి చేసిం చంపారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే  తాజాగా పాకిస్థాన్‌లో మరోసారి హిందూ రైతుని కాల్చిచంపారు.

సింధూ ప్రావిన్సూకు చెందిన సర్ఫరాజ్ నిజమని అనే భూస్వామికి చెందిన భూమిని కైలాస్ కోల్హి అనే హిందూ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు. రెండురోజుల క్రితం కైలాస్ కోల్హి ఛాతిపై సర్ఫరాజ్ కాల్పులు జరిపాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రైతు మృతితో పాకిస్థాన్‌లోని మైనార్టీలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. 

పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు  మానవత్వంపై జరిగిన దాడి" అని ఆయన అన్నారు. కైలాస్ కోల్హిపై ఎందుకు కాల్పులు జరిపారో అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు  మానవత్వంపై జరిగిన దాడి, నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి." అని ఆయన అన్నారు. కాగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలని తొలగించే పనులలో భాగంగా టర్కీగేట్ వద్ద ఫైజ్‌-ఇ-ఇలాహి మసీదు సమీపంలోని కట్టడాలను తొలగించారు.

దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ భారత్‌లో మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారంటూ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మైనార్టీలపై తరచుగా దాడులు చేసే దేశానికి ఈ వ్యాఖ్యలు చేసే హక్కులు లేదని విమర్శించింది.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement