టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల కొద్దికాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్లో ఉంటోంది. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. పదహారు రోజుల పండుగ పేరుతో వస్తోన్న టాలీవుడ్ మూవీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫన్ బిగిన్స్ అంటూ అనసూయతో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది .
ఈ మూవీతో నంది అవార్డ్ విన్నర్ సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2008లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో నటనకు గానూ సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత డీఎస్ రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో గోపికా ఉద్యన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గతంలో కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. ఇందులో కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


