సోషియో ఫాంటసీ కథతో ‘వానర’ | Vaanara Movie First Look Poster Out | Sakshi
Sakshi News home page

సోషియో ఫాంటసీ కథతో ‘వానర’

Nov 26 2025 7:05 PM | Updated on Nov 26 2025 8:03 PM

Vaanara Movie First Look Poster Out

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది.

"వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.  వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement