చిన్న వయసులో వెండితెరపై అడుగుపెట్టి తర్వాత హీరోయిన్‌గా రాణించినవారు చాలామంది ఉన్నారు. పైన కనిపిస్తున్న ఈ క్యూట్ పాప కూడా మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది. 20 ఏళ్లు కూడా నిండకముందే హీరోయిన్‌గా సినిమాలు చేసింది. ఇంతకీ తనెవరో గుర్తుపట్టారా? ఆ పాపే 'బుట్టబొమ్మ' అనిఖా సురేంద్రన్ (Anikha Surendran).
చైల్డ్ ఆర్టిస్ట్‌గా..
ఈ మలయాళ కుట్టి బాలనటిగా యాక్ట్ చేసిన మొదటి చిత్రం 'కద తుదరున్ను'. అప్పుడు తన వయసు ఆరేళ్లే! విశ్వాసం సినిమాలో అజిత్- నయనతార కూతురిగా నటించింది. అప్పటినుంచి తనను కుట్టి నయనతార అని పిలుస్తూ ఉంటారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ, తమిళ భాషల్లో దాదాపు 15 సినిమాలు చేసింది. తెలుగులో ద ఘోస్ట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. 19 ఏళ్ల వయసులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కానీ, తర్వాత మళ్లీ తెలుగులో కనిపించనేలేదు.

సినిమాలు
మలయాళంలో ఓ మై డార్లింగ్, కింగ్ ఆఫ్ కొత్త.. తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం(తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా), ఇంద్ర, పీటీ సర్ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక మూవీ చేస్తోంది. యూట్యూబర్‌లో రెండు,మూడు షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. రెండేళ్ల క్రితం ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ వైరలయింది. అది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ అది రియల్ పోస్టర్ కాదు, రీల్ పోస్టర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ బుట్టబొమ్మ తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో చూడాలి!


