ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి | Bigg Boss 9 Telugu Today Episode Promo Video Viral, Bharani Shankar Disappointed Over Thanuja Commanding | Sakshi
Sakshi News home page

Bigg Boss 9 Telugu: కల్యాణ్‌పై తనూజ కమాండింగ్‌.. భరణియే చెప్పాలి మరి!

Dec 10 2025 10:49 AM | Updated on Dec 10 2025 10:58 AM

Bigg Boss 9 Telugu: Bharani Shankar Disappointed over Thanuja Commanding

ఇమ్యూనిటీ + ఓట్‌ అప్పీల్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్‌ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్‌ అందరికంటే మొదటగా ఓట్‌ అప్పీల్‌ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్‌ అప్పీల్‌ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

బాల్‌ గేమ్‌
అందులో సంజనా, కల్యాణ్‌ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్‌ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్‌ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్‌ అయిపోయాక భరణి.. సుమన్‌తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్‌) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. 

భరణిపై సెటైర్స్‌
తనూజ ఎక్కువ కమాండ్‌ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్‌ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో తనూజ ఓట్‌ అప్పీల్‌ గెలిచినట్లు భోగట్టా!
 

చదవండి: ఇమ్మాన్యుయేల్‌ ప్రభంజనం.. టాప్‌5లో ఉంచమని రిక్వెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement