ఊహకి కూడా అందదు | Akhanda 2 Thandavam action-packed second teaser Blasting Roar Video Releases | Sakshi
Sakshi News home page

ఊహకి కూడా అందదు

Oct 25 2025 2:21 AM | Updated on Oct 25 2025 2:21 AM

Akhanda 2 Thandavam action-packed second teaser Blasting Roar Video Releases

హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఈ చిత్రంలో హీరోయిన్‌ సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్‌ రోర్‌ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘‘ఊహకి కూడా అందదు’’ అని బాలకృష్ణ పలికే డైలాగ్‌ ఈ వీడియోలో ఉంది. బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్‌లోనే వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement