
బాలకృష్ణ హీరోగా బోయ పాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో జరుగుతోంది.
బాలకృష్ణ పాల్గొనగా భాను మాస్టర్ కొరియోగ్రఫీలో 600 మంది డ్యానర్లతో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘‘బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొడుతున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించేలా ఈ పాట ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్.