రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘టార్టాయిస్’ అనే కొత్త సినిమా ఆరంభమైంది. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ప్రశ్విత ఎంటర్‌టైన్మెంట్, ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్‌పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘టార్టాయిస్’ చిత్రం చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటుంది. నా కెరీర్‌కు కిక్ ఇచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు. ‘‘సరికొత్త స్క్రీన్ ప్లేతో సాగే థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు రిత్విక్ కుమార్.
‘‘త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు పేర్కొన్నారు. ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.


