breaking news
Amrutha Chowdary
-
ఓటీటీలో సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇన్‌స్టా ఫేమ్ 'అమృత చౌదరి'కి ఫ్యాన్స్ ఫిదా
ప్రెజర్ కుక్కర్, లగ్గం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి రోనక్.. ఆయన నటించిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా రివైండ్ (Rewind Movie) సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అమృత చౌదరి హీరోయిన్గా నటించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నాలుగు నెలల తర్వాత మార్చి 10న ఓటీటీలో విడుదలైంది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ రివైంట్ చిత్రం అందుబాటులో ఉంది.సాయి రోనక్, అమృత చౌదరి కాంబినేషన్‌తో రివైండ్ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సురేశ్, సామ్రాట్, వైవా రాఘవ్, జబర్దస్త్ నాగి, అభిషేక్ విశ్వకర్మ, ఫన్‌బకెట్ భరత్.. తదితరులు కీలక పాత్ర పోషించారు. కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. శివరామ్ చరణ్ సినిమాటోగ్రాఫీ అందించగా ఆశీర్వాద్ లూక్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ 2024 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఐఎమ్బీడీ రేటింగ్ 9.4 ఉండటం విశేషం.కథేంటి..?ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by Amrutha Chowdary (@__amrutha__chowdary__) -
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రివైండ్’ మూవీ ఎలా ఉందంటే?
టైటిల్: రివైండ్ నటీనటులు: సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ గారు, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులునిర్మాణ సంస్థ : క్రాస్ వైర్ క్రియేషన్స్దర్శకతం: కళ్యాణ్ చక్రవర్తిసంగీతం : ఆశీర్వాద్సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్విడుదల తేది: అక్టోబర్ 18, 2024సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘రివైండ్’. ఈ చిత్రంతో కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథ 2019-2024 మధ్య కాలంలో జరుగుతుంది. కార్తిక్(సాయి రోనక్) ఓ సాఫ్ట్వేర్. తన స్నేహితుడు సుబ్బు అపార్ట్మెంట్లో శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్ అవ్వడంతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు కానీ బయటకు చెప్పుకోరు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అదే రోజు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్) కనిపెట్టిన టైం మిషన్ సహాయంతో కార్తిక్ ట్రైమ్ ట్రావెల్ చేసి 2019 కాలం నాటికి వెళ్తాడు. ఆ తర్వాత కార్తిక్ జీవితంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? కార్తి ట్రైమ్ ట్రావెల్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్ మిషన్ కార్తికి ఇంటికి ఎలా చేరిది? కార్తిక్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ ఎంటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. టైం ట్రావెల్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. రివైండ్ కూడా ఓ డిఫరెంట్ టైం ట్రావెల్ స్టోరీ. ఓ మంచి ప్రేమ కథకి టైం ట్రావెల్ కాన్సెప్ట్‌ని యాడ్ చేసి ఎంటర్టైనింగ్ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్. సినిమా ప్రారంభంలోనే సామ్రాట్ టైం ట్రావెల్ చేసి రావడం.. తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ.. కారు ప్రమాదం జరగ్గానే మాయమైపోవడంతో కథపై ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత కథలోకి కార్తీక్, శాంతి పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. వీరిద్దరి మధ్య జరిగే క్యూట్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. మధ్య మధ్యలో అనేక అనుమానాలు రేకెత్తిస్తూ కథనాన్ని నడిపించాడు. ఇంటర్వెల్ సయమానికి ప్రేక్షకుడి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సెకండాఫ్‌లో సమాధానాలు దొరుకుతాయి. ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్‌కి ఉన్న కనెక్టివిటీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. క్లైమాక్స్ కూడా ఊహకు అందకుండా పార్ట్ 2కి లీడ్ ఇచ్చేలా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కార్తిక్ పాత్రలో సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. లవర్ బాయ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శాంతి పాత్రకు అమృత చౌదరి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తోటి సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణం విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా కనిపించింది.Rating: 2.75/5